PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పుట్లగాట్లాగూడెంలో ఇంటి కొలతలు పరిశీలిస్తున్న డీపీఓ

1 min read

– స్వమిత్వ సర్వే పూర్తి చేయండి. విస్తరణ అధికారులకు, కార్యదర్సులకు డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్ ఆదేశం..

– జిల్లా వ్యాప్తంగా నవంబర్ 10 వరకు స్వమిత్వ ప్రత్యేక డ్రైవ్

– అలసత్వం వహిస్తే సిబ్బందిని సస్పెండ్ చేస్తానని హెచ్చరిక

– విస్తరణ అధికారులకు, పంచాయతీ కార్యదర్సులకు మండలాల వారీగా లక్ష్యం పూర్తి చేయాలని దిశ నిర్దేశం

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  : బుట్టాయిగూడెం  స్వమిత్వ సమగ్ర సర్వేను సకాలంలో పూర్తి చేయాలని జిల్లా గ్రామ పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్ గ్రామ పంచాయతీ కార్యదర్సులను, విస్తరణ అధికారులను ఆదేశించారు. స్వమిత్వ జిల్లా ప్రగతి రాష్ట్రస్థాయిలో అద్వాణంగా ఉందని,  664 గ్రామాలలో డ్రోన్ ఫ్లై పూర్తయినా 36 కాలమ్ నమూనాలో పూర్తి కావల్సిన గృహ ప్రాధమిక సమాచారం 271 గ్రామాలలో మాత్రమే పూర్తి అయ్యిందని డీపీఓ అన్నారు. డివిజన్ వారీగా చుస్తే ఏలూరు డివిజనులో 140, జంగారెడ్డిగూడెంలో 83, నూజివీడు డివిజనులో 54 గ్రామ పంచాయతీలలో ప్రాధమిక సర్వే పూర్తి చేయవల్సి ఉందన్నారు. జిల్లాలో పెదవేగి, పెదపాడు, భీమడోలు, ఏలూరు, ఉంగుటూరు, పోలవరం, చాటరాయి తదితర మండల ప్రగతి స్వమిత్వలో అంతగా బాలేదన్నారు, అందుకే జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశాలుతో ఈ నెలలు అక్టోబర్ 27 నుండి నవంబర్ 10 వరకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి 36 కాలమ్ ప్రాధమిక గృహ సర్వేతో పాటు గ్రౌండ్ ట్రూథింగ్, గ్రౌండ్ వ్యాలీడేషన్, క్వాలిటీ చెక్, 13 నోటిఫికేషన్, రికార్డు అఫ్ రైట్స్ తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని స్వమిత్వ సర్వే పూర్తి చేయడానికి ప్రణాళికలి సిద్ధం చేసామన్నారు. పంచాయతీ రాజ్, సర్వే సిబ్బంది సమన్వయంతో జరగవల్సిన ఈ సర్వేలో సిబ్బంది అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పంచాయతీ కార్యదర్సులు, విస్తరణ అధికారులు తమకు నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని లేని పక్షంలో విధులకు నుండి సస్పెండ్ చేయడానికి కూడా వెనుకాడనని అన్నారు. స్వమిత్వ సర్వే ప్రగతిపై టెలీకాన్ఫెరెన్స్ ద్వారా రోజువారీ ప్రగతిని విస్తరణ అధికారులు, కార్యదర్సులతో సమీక్షించడం జరుగుతుందని డీపీఓ అన్నారు. బుట్టాయిగూడెం మండలం, అంతర్వేదిగూడెం పంచాయతీ, జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం పంచాయతీ కార్యాలయాలను ఆకస్మిక తనిఖీ చేసి  క్షేత్రస్థాయిలో జరుగుతున్న స్వమిత్వ గృహల సర్వేను తనిఖీ చేసి కొలతలు నమోదు చేసారు అనంతరం ప్రగతిని సమీక్షించారు. సందర్బంగా డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్ మాట్లాడుతూ స్వమిత్వ సర్వే ద్వారా ప్రజలకు ఎంతో మేలని, ప్రభుత్వ ప్రధాన అజెండా అంశమైన స్వమిత్వ సర్వేని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్  ఆదేశాలతో గడువులోపు పూర్తి చేస్తామని డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్ అన్నారు.

About Author