డా. అచ్చన్న మృతి పై న్యాయ విచారణ జరపాలి
1 min read– మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి
– ఎమ్మార్పీఎస్ డిమాండ్
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: రాష్ట్రంలో దళితులకు దళిత మహిళలకు. దళిత అధికారులకు, దళిత ఉన్నతాధికారుల కూడా రక్షణ కరువైందని డాక్టర్ . అచ్చన్న హత్యకు కారణమైన వారిని ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని ఎమ్మార్పీఎస్ ఉమ్మడి జిల్లా సీనియర్ నాయకులు ప్రేమ్ రాజుమాదిగ, ఎస్. విజ్జి మాదిగలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నందికొట్కూరు పట్టణంలో విలేకరుల సమావేశంలో సోమవారం వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దళిత ఆఫీసర్లు. దళితులపైనే దాడులు బెదిరింపులు హత్యలు పెరిగిపోయాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. డిడి మ తిపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయని చెప్పారు. పశుసంవర్ధకశాఖలో పనిచేస్తున్న కొంత మంది సిబ్బందికి, అచ్చెన్నకు శాఖాపరమైన సమస్యలున్నాయని, ఈ నేపథ్యంలో తన తండ్రి కన్పించడం లేదని మృతుని కుమారుడు క్లింటన్ చక్రవర్తి పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు స్పందించలేదన్నారు. అద శ్యమైన అచ్చెన్న ఈనెల 24న శవమై తేలడం పలు అనుమానాలకు తావిస్తున్నాయని పేర్కొన్నారు. ఇది ముమ్మాటికీ హత్య అని ఆరోపించారు. పశువైద్యశాలలో డిప్యూటీ డైరెక్టర్ అచ్చెన్నకు సహచర ఉద్యోగులు శాఖపరంగా సహకరించకపోగా, తనకు వ్యతిరేకంగా మాట్లాడుతూ, వివక్షత చూపుతూ, మానసికంగా వేదించేవారని చెప్పారు. ఉన్నత అధికార యంత్రాంగం దష్టికి తీసుకుపోయినప్పటికీ పట్టించుకోకపోవడంతోనే ఓ దళిత అధికారి ప్రాణాలు కోల్పోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన దళిత, బడుగు, బలహీన వర్గాలపై హింసను ప్రేరేపిస్తోందన్నారు. ఇటీవల కాలంలో దళిత డాక్టర్ సుధాకర్ పై ప్రభుత్వ వేధింపులకు తాళలేక గుండెపోటుతో మరణించిన ఘటన మరవకముందే పశుసంవర్ధక శాఖలో పనిచేస్తున్న డాక్టర్ సి. అచ్చన్న మరణం తీరని దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ అచ్చెన మతి పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపేంతవరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. అంతేకాకుండా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటు వేసిందని వైసీపీ నుండి సస్పెండ్ అయిన ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కి ప్రాణహాని ఉందని మీడియా ముందు చెప్పడం చూస్తే ఈ ప్రభుత్వం . దళితులపై ఎలాంటి చర్యలకు పాల్పడుతుందో అర్థమవుతుందని కాబట్టి ఆమెకు రక్షణ కల్పించాలని ఏదైనా హానీ జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాముడు, దిలీప్, నాగేశ్వరరావు, శివన్న, పెద్ద స్వాములు, రాజేష్, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.