బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ అంబేద్కర్
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు : రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 63వ వర్ధంతి సందర్భంగా బుధవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్, ఎంపీడీవో సుబ్రహ్మణ్యం శర్మ ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు, ఈ సందర్భంగా ఎంపీపీ ఎంపీడీవో లు మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని వారు అన్నారు, ఆనాడు ఆయన రాసిన రాజ్యాంగ స్ఫూర్తితోనే నేటికీ బడుగు బలహీన వర్గాలు స్వేచ్ఛ జీవితాన్ని గడుపుతున్నారని వారు తెలిపారు, అలాగే మండలంలోని రామనపల్లె గ్రామంలో అంబేద్కర్ సేవాసమితి అధ్యక్షులు గురయ్య ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు, గురయ్యా మాట్లాడుతూవిద్యలో అపార జ్ఞానాన్ని సంపాదించి జ్ఞాన సూర్యుడుగా పేరు తెచ్చుకున్న వ్యక్తి అంబేద్కర్ అన్నారు. అంటరానితనాన్ని రూపుమాపడానికి సమర శంఖాన్ని పూరించిన మహనీయుడని కొనియాడారు. బడుగు బలహీన వర్గాలు ఎదుర్కొంటున్న విద్య ఆర్థిక పరిస్థితులపై ఉద్యమాలు నడిపి మేమెంతో మాకంతాని రిజర్వేషన్లు సాధించిన పోరాట యోధుడు డాక్టర్ బి.ఆర్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని అన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగానికి నాయకత్వం వహించిన ప్రతిపా పాట వాళ్లను ప్రదర్శించి అఖండ భారతావనికి దశ దిశ నిర్దేశం చూపిన మహనీయుడు రూప శిల్పి, దార్శనికుడు అంబేద్కర్ అ న్నారు. బీసీల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలేను తన గురువు గా భావించి 420 అధికరణ ద్వారా బి బీసీలకు ఎస్సీ ఎస్సీ ఎస్టీ లాగానే రిజర్వేషన్లు ఉండాలని చట్టంలో రూపొందించిన సమతావాది అని ఈ సందర్భంగా వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ జి ఎన్ భాస్కర్ రెడ్డి, ఎర్ర సాని మోహన్ రెడ్డి, సర్పంచ్ తుంగ చంద్రశేఖర్ యాదవ్, నిత్య పూజయ్య, పిచ్చయ్య , పెంచలయ్య, పెద్ద ఓబులేసు, చిన్నయ్య ,రమణ, సుధాకర్ గంగయ్య తదితరులు పాల్గొన్నారు.