NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా డా. చింతల మోహన్ రావు నియామకం

1 min read

పల్లెవెలుగు వెబ్  నంద్యాల: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా నియామక పత్రాన్ని అందుకున్న డాక్టర్ చింతల మోహన్ రావు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా రెండవసారి నియామక పత్రాన్ని పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, నంద్యాల జిల్లా అధ్యక్షుడు లక్ష్మీ నరసింహ యాదవ్ చేతుల మీదుగా విజయవాడలో నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ చింతల మోహన్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కొరకు రాష్ట్రంలో , దేశంలో ఏ ప్రాంతంలోనైనా కష్టపడి పని చేయడానికి ఒక సైనికుడు లాగా ఉంటానని యువ నాయకులు రాహుల్ గాంధీ  ప్రధానమంత్రినీ చేసి ఆ భారతదేశాన్ని భారత రాజ్యాంగాన్ని కాపాడడమే లక్ష్యంగా *ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం అనే నినాదంతో గడపగడపకు వెళ్లి ప్రతి వ్యక్తిని దేశవ్యాప్తంగా కలిసి కాంగ్రెస్ పార్టీ వల్ల మాత్రమే ఈ దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టే వారికి తగిన బుద్ధి చెప్పగలమని ఈ దేశం అభివృద్ధి చెందాలి అని అంటే కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎలక్షన్లలో గెలుపు ఈ దేశానికి అవసరమని యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోయి కర్షకులు కార్మికులు, రైతులు చాలా రకాల ఇబ్బందులను తీరాలి అంటే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఆవశ్యకత ఎంతైనా ఉంది అందువలన పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ చింతల మోహన్ రావు తెలిపారు.

About Author