డా. బిఆర్. అంబేద్కర్ గురుకుల విద్యాలయాలలో దరఖాస్తులు ఆహ్వానం
1 min read![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2025/02/8-9.jpg?fit=550%2C246&ssl=1)
2025-26 విద్యా సంవత్సరమునకు 5 వ తరగతి మరియు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశము కొరకు నోటిఫికేషన్
పశ్చిమగోదావరి జిల్లా సమన్వయ అధికారి బి.ఉమా కుమారి
ఫిబ్రవరి 7వ తేదీ నుండి మార్చి6వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు
పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న డా. బి. అంబేద్కర్ గురుకుల విద్యాలయాలలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను 5 వ తరగతి (ఇంగ్షీషు మాధ్యమం)మరియు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశమునకు బాలురు మరియు బాలికల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఏలూరు మరియు పశ్చిమగోదావరి జిల్లా సమన్వయ అధికారి బి. ఉమాకుమారి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్దులు ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. అర్హులైన అభ్యర్ధులు దరఖాస్తులు ఈ నెల 7వ తేదీ నుండి వచ్చే నెల మార్చి 6వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆమె కోరారు. ప్రవేశ పరీక్ష తేది :- 06 .04 .2025 , 5 వ తరగతి టైమ్ ఉదయం : 10.00 నుండి 12.00 వరకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం టైమ్ :- 2.00 నుండి 4.30 వరకు జరుగును. ఏలూరు జిల్లా నందు పాఠశాలలు:- బాలురు -2 (పెదవేగి,చింతలపూడి) బాలికలు –5 (పొలాసానిపల్లి, వట్లూరు, ద్వారకతిరుమల,జంగారెడ్డిగూడెం, నూజువీడు) పశ్చిమ గోదావరి జిల్లా నందు పాఠశాలలు: -బాలురు – 3 (ఆరుగోలను, న్యూ ఆరుగోలను,యల్. బి. చర్ల నరసాపురం) బాలికలు – 1 (పెనుగొండ – ఆచంట ) ఏలూరు జిల్లా నందు కళాశాలలు బాలురు-1( పెదవేగి), బాలికలు – 5(పొలాసానిపల్లి, వట్లూరు, ద్వారకతిరుమల,జంగారెడ్డిగూడెం, నూజువీడు)పశ్చిమ గోదావరి జిల్లా నందు కళాశాలలు:బాలురు–2(ఆరుగోలను,యల్.బి.చర్ల నరసాపురం)సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లుః కె.శేఖర్ 9963007079,టి.పవన్ 9666699243, సిహెచ్. వీరాస్వామి 970551508 నెంబర్లను సంప్రదించవచ్చన్నారు.