డా. బి. ఆర్ అంబేద్కర్ ఫ్లెక్సీని చించిన వారి పై కఠిన చర్యలు తీసుకోవాలి
1 min read
ఎస్డీపిఐ డిమాండ్
హొళగుంద, న్యూస్ నేడు : కర్నూలు జిల్లా ఆలూరు తాలూక హొళగుంద మండలం పార్టీ కార్యాలయం నందు పత్రిక సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో ఎస్డీపిఐ ఆలూరు అసెంబ్లీ కార్యదర్శి కె.సలాం మాట్లాడుతూ హొళగుంద మండలం లింగంపల్లి గ్రామంలో మాల మహానాడు కర్నూలు జిల్లా నాయకుల ఆధ్వర్యంలో కొద్ది రోజుల కిందట దళితులైనటువంటి వారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కోసం లింగంపల్లి గ్రామంలో భూమి పూజ చేయడం జరిగింది. మరియు గ్రామకంఠం బంజర దొడ్డి గవర్నమెంట్ స్థలంలో అంబేద్కర్ ఫ్లెక్సీని , జండను ఆవిష్కరించడం జరిగింది. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు దాన్ని చూసి జీర్ణించలేక మొన్న అనగా 06/04/25 రోజున రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఫ్లెక్స్ ను మరియు జండా కట్ట ను తొలగించడం జరిగింది అన్నారు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ని ఘోరంగా అవమానపరిచే విదంగా చింపడం జరిగింది అన్నారు దీనిపై విచారించి కఠిన చర్యలు తీసుకోవాలని హొళగుంద ఎస్ఐ దిలీప్ కుమార్ ని కోరుచున్నాను అని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్డీపిఐ ఆలూరు అసెంబ్లీ ఉపాధ్యక్షులు అబ్దుల్ రెహమాన్ కార్యదర్శి హఫీజ్. అల్లబకాష్. తదితరులు పాల్గొన్నారు