జిల్లా కేంద్ర గ్రంథాలయంలో డా:బాబు జగజ్జీవన్ రావు జయంతి వేడుకలు
1 min read
భారతదేశానికి ఎన్నో సేవలు అందించిన మహనీయులు బాబు జగజ్జివన్ రావు
గ్రంథాలయ జిల్లా కార్యదర్శి ఎం.శేఖర్ బాబు
బాబు జగజ్జివన్ రావు 27 సంవత్సరాలకే శాసనమండలికి ఎన్నిక,అన్ని శాఖలలో దీర్ఘకాలం పాటు పనిచేసిన ఘనత
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : భారతదేశ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రావు 117 వ జయంతి వేడుకలు పురస్కరించుకొని ఏలూరు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో డాక్టర్:బాబు జగజీవన్ రావు చిత్రపటానికి గ్రంథాలయ జిల్లా కార్యదర్శి ఎం శేఖర్ బాబు, డిప్యూటీ లైబ్రేరియన్ ఏ. నారాయణరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా కార్యదర్శి ఎం. శేఖర్ బాబు మాట్లాడుతూ స్వతంత్ర సమరయోధులు సంఘ సంస్కర్ణకర్తగా తన పరిపాలనలో అనేక మార్పులు తీసుకొచ్చిన మహనీయులు డాక్టర్ బాబు జగ్జీవన్ రావు ని కొనియాడారు. డిప్యూటీ లైబ్రేరియన్ ఏ.నారాయణ రావు మాట్లాడుతూ 27 సంవత్సరాలకే శాసనమండలికి ఎన్నికయ్యి దేశ తొలి కార్మిక శాఖ మంత్రిగా, రక్షణ మంత్రిగా వ్యవసాయ శాఖ, రైల్వే ,సివిల్ సప్లై మంత్రిగా పనిచేసే 52 ఏళ్ళు పార్లమెంటు సభ్యునిగా ఎన్ని క అనంతరం భారతదేశానికి ఎన్నో సేవలందించిన మహానుభావులని కొనియాడారు.ఈ కార్యక్రమంలో సహాయ లైబ్రేరియన్ వి.టి సందీప్ కుమార్ మరియు జిల్లా కేంద్ర గ్రంథాలయ సిబ్బంది, గ్రంథాలయ పాఠకులు తదితరులు పాల్గొన్నారు.