PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఈ దేశానికి దిశా, నిర్దేశం చేసిన గొప్ప రాజ నీతిజ్ఞుడు డా. బి.ఆర్ అంబేద్కర్

1 min read

డాక్టర్:పొలిమేర హరికృష్ణ

జై భీమ్ సేవ ట్రస్ట్ అధ్యక్షులు విప్పర్తి ప్రసాద్ ఆధ్వర్యంలో కార్యక్రమం

పెద్ద ఎత్తున పాల్గొన్న ఉద్యోగ, ఉపాధ్యాయ, సంఘ నాయకులు

కరెన్సీ నోటుపై డాక్టర్:బి.ఆర్ అంబేద్కర్ ముఖచిత్రాన్ని ముద్రించాలని డిమాండ్

ఆకట్టుకున్న పలు సాంస్కృతి కార్యక్రమాలు

పల్లెవెలుగు వెబ్​ ఏలూరు జిల్లా ప్రతినిధి : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ  విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ :  పోలిమేర హరి కృష్ణ దేశానికి దిశ నిర్దేశం చేసిన గొప్ప రాజ నీతిజ్ఞుడు డాక్టర్ బి.ఆర్   అంబేద్కర్ అని కొనియాడారు.డాక్టర్ : బి.ఆర్ అంబేద్కర్   133 వ జయంతి పురస్కరించుకుని స్థానిక పాత బస్టాండ్ అంబేద్కర్ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఆదివారం పలు సాంస్కృతిక కార్యక్రమాలతో విపర్తి  ప్రసాద్ ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, సంఘ నాయకుల మరియు  అతిరథల సమక్షం  కన్నుల పండుగగా జరిగింది. పొలిమేర హరికృష్ణ  నగరంలో పలు అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలు వేసి తన అనుచరులతో నివాళులర్పించారు. జై భీమ్ ట్రస్ట్ వ్యవస్థాపకులు నిర్విరామంగా కొన్ని సంవత్సరాల నుండి అంబేద్కర్ జయంతిని, వర్ధంతిని నిర్వహిస్తున్నారు. ఆయన చేస్తున్న కార్యక్రమాలను పలువురు ప్రముఖులు కొనియాడారు. ఈ సందర్భంగా దళిత ప్రభంజనం నాయకులు పొలిమేర హరికృష్ణ  మాట్లాడుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటుకు కారణం దానికి మూలాలు డాక్టర్:బి.ఆర్ అంబేద్కర్ ని ఆయన ముఖచిత్రాన్ని భారత కరెన్సీ పై ముద్రించికపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఈ దేశాన్ని పాలించిన పాలిస్తున్న రాజకీయ పార్టీలు భవిష్యత్ కాలంలో ఆయన ముఖచిత్రాన్ని భారత కరెన్సీ పై ముద్రించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు త్వరగతిన ఈ విషయంపై నిర్ణయం తీసుకోవాలని లేనియెడల దేశంలో ఉన్న ఎస్సీ, బీసీ , మైనార్టీ, గిరిజన రాజకీయ పార్టీలన్నింటి ని కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని  హరికృష్ణ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యోగ, ఉపాధ్యాయ, సంఘ నాయకులు జిల్లా ఎస్సీ, ఎస్టీ, మోనటరింగ్ కమిటీ సభ్యులు మేతర అజయ్ బాబు మరియు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, జేఏసీ నాయకులు సోoగా మధుసూదన్ రావు, అంగులూరి మార్తమ్మ, గోపాల్ యాదవ్, ప్రముఖ అంబేద్కర్ రిస్ట్ ఎం జయరాజు, చిలి వీరబాబు, జగన్, కటారి రాజేష్, చోదిమెళ్ళ బుజ్జి, మందపాటి జోజి, మేదర స్వామి, చింతాటి వెంకీ పలువురు దళిత ,బహుజన నాయకులు పాల్గొన్నారు.

About Author