గొప్ప మహనీయుడు స్ఫూర్తి దాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్
1 min readఘనంగా బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: అంబేద్కర్ గొప్ప మహనీయుడు స్ఫూర్తి దాత, దళిత సామాజిక మహనీయుడని కడప మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ జి ఎన్, భాస్కర్ రెడ్డి, ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్ లు ,అన్నారు ఆదివారం డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని స్థానిక ఎంపీపీ కార్యాలయం లో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు, అనంతరం వారు మాట్లాడుతూ, భారత రాజ్యాంగ నిర్మాత మహనీయులు, ఆదర్శవంతులు దళిత జాతి సామాజిక న్యాయం కోసం అహర్నిశలు కృషి చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని కొనియాడారు, దళితులు సామాజిక అణచివేత, వివక్షత కు గురికాకుండా ఆయన తమ పోరాటాన్ని సాగించారు అన్నారు, ఆయన పోరాట స్ఫూర్తితో నేడు దళిత జాతి సామాజిక ఆర్థిక రాజకీయ స్వాలంబన ఏర్పడిందని వారు తెలియజేశారు, అదేవిధంగా చెన్నూరు మేజర్ గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచ్ సిద్ది గారి వెంకటసుబ్బయ్య( కళ్యాణ్) అధ్యక్షతన ఆదివారం చెన్నూరు గ్రామ పంచాయతీ పార్కు నందు జరిగిన గ్రామసభ కార్యక్రమము నందు బి ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు సర్పంచ్ వెంకటసుబ్బయ్య, గ్రామ పంచాయతీ కార్యదర్శి. రామ సుబ్బారెడ్డి, వార్డు సభ్యులు గ్రామ సచివాలయ ఉద్యోగులు బిఆర్ అంబేద్కర్ కు ఘనంగా నివాళులు అర్పించారు, అలాగే మండలంలోనిరామన పల్లె లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సేవా సమితి అధ్యక్షుడు గురయ్య ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు, ఈ సందర్భంగా వారు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు, ఈ సందర్భంగా గురవయ్య మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ బడుగు బలహీన వర్గాల కోసం ఆయన చేసిన కృషి అభినందనీయమని ఆయన కొనియాడారు. చెన్నూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి రామ సుబ్బారెడ్డి మాట్లాడుతూ బి ఆర్ అంబేద్కర్ స్ఫూర్తి అభినందనీయమని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నిరంజన్ రెడ్డి, నీలంశ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.