PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ’ గుర్తింపు పొందిన డా.చంద్రశేఖర్

1 min read

పల్లెవెలుగు వెబ్​: కర్నూలు  గవర్నమెంటు జనరల్ హాస్పిటల్ కార్డియాలజీ విభాగాన్ని అత్యున్నత స్థాయిలో తీర్చిదిద్ది… రెండు దశాబ్దాలుగా వేలాది రోగులకు వైద్యసేవలు అందించిన ప్రముఖ గుండె వైద్యనిపుణులు డా. చంద్రశేఖర్​ను లండన్​కు చెందిన ‘వరల్డ్​ బుక్​ ఆఫ్​ రికార్డ్స్​’ “సర్టిఫికెట్ ఆఫ్ కమిట్మెంట్ అవార్డు వరించింది.  ఈ విషయం ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’ సంస్థ జాయింట్ సెక్రెటరీ ఎలియాజర్  స్వయంగా ప్రకటించారు. కోవిడ్​ ఫస్ట్​ వేవ్​లో రోగులకు అండగా నిలబడుతూ..  వైద్యసేవలతో వారి ప్రాణాలకు భరోసాగా నిలిచిన గుండె వైద్యనిపుణులు డా. చంద్రశేఖర్​ సేవలు అద్వితీయమని ప్రశంసించారు జాయింట్ సెక్రెటరీ ఎలియాజర్. సోమవారం కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలోని కార్డిలయాలజీ విభాగం కాన్ఫరెన్స్​ హాల్​ సంస్థ జాయింట్ సెక్రెటరీ, సౌత్ ఇండియా ఇంఛార్జి శ ఎలియాజర్ ఆధ్వర్యంలో  డా. చంద్రశేఖర్​కు అవార్డు ప్రదానం చేయనున్నారు. కార్యక్రమానికి జిల్లా జడ్జి శ్రీ రాధాకృష్ణ కృపాసాగర్  ముఖ్య అతిథిగా విచ్చేయున్నారు.

About Author