డా.చంద్రశేఖర్ సేవలు.. ఎనలేనివి..
1 min readడా. శంకర్ శర్మ, డా. భవాని ప్రసాద్
- జర్నలిస్టులకు ఉచిత గుండె వైద్య శిబిరం
కర్నూలు, పల్లెవెలుగు:సంపాదనలో కొంతైనా సమాజ శ్రేయస్సుకు ఉపయోగించాలని, అందుకు నిదర్శనం ప్రముఖ కార్డియాలజిస్ట్ డా. చంద్రశేఖర్ ఆదర్శంగా నిలుస్తారని ప్రశంసించారు డా. శంకర్. డా. భవాని ప్రసాద్. ఆదివారం కర్నూలు హార్ట్ ఫౌండేషన్ కార్యాలయ ఆవరణలో జర్నలిస్టులకు గుండె సమస్యలకు సంబంధించి ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులకు బీపీ, షుగర్, ఈసీజీ, 2డికే, లివర్ సమస్యలపై పరీక్షలు, తదితర విలువైన వైద్య చికిత్సలు ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన డా. శంకర్ శర్మ, డా. భవాని ప్రసాద్ మాట్లాడుతూ వైద్యరంగంలో డా. చంద్రశేఖర్ చేసిన సేవలు అద్భుతమన్నారు. కర్నూలు హార్ట్ ఫౌండేషన్ ద్వారా పేద, మధ్య తరగతి ప్రజలకు వివిధ వ్యాధులపై సంబంధిత వైద్యులతో అవగాహన సదస్సు నిర్వహించడం అభినందనీయమన్నారు. జిల్లా ప్రజలకు వైద్య సేవలు అందించడంలో డా. చంద్రశేఖర్ ముందుండటం సంతోషకరమన్నారు. ప్రతిఒక్కరూ తాము ఎంచుకున్న… రాణిస్తున్న రంగంలో సమాజ శ్రేయస్సు కోసం సేవలు అందించాలని ఈ సందర్భంగా డా. శంకర్ శర్మ, డా. భవాని ప్రసాద్ కోరారు. కార్యక్రమంలో సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ విజయమ్మ, డా.మహేష్ తదితరులు పాల్గొన్నారు.