NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

డా. ఎన్టీఆర్​ హెల్త్​ యూనివర్శిటీ అభివృద్ధికి కృషి

1 min read

వైద్య పరిశోధనలకు ప్రాధాన్యమిస్తా

  • డా. ఎన్టీఆర్​ హెల్త్​ యూనివర్శిటీ వీసీ డా. చంద్ర శేఖర్​
  • సీఎం, రాష్ట్ర గవర్నర్​ కు ప్రత్యేక కృతజ్ఞతలు

కర్నూలు ( హాస్పిటల్​ ), న్యూస్​ నేడు :రాష్ట్రంలో డా. ఎన్టీ ఆర్​ హెల్త్​ యూనివర్శిటీని అభివృద్ధి చేసేందుకు నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేశారు డా. ఎన్టీ ఆర్​ హెల్త్​ యూనివర్శిటీ వైస్​ ఛాన్సలర్​ డా. చంద్ర శేఖర్​.  శుక్రవారం విజయవాడలోని డా. ఎన్టీఆర్​ హెల్త్​ యూనివర్శిటీ కార్యాలయంలో వైస్​ ఛాన్సలర్​ గా డా. చంద్ర శేఖర్​ పదవీ బాధ్యతలు స్వీకరించారు. సాంప్రదాయ పద్ధతిలో భాగంగా ముందుగా శ్రీ వేంకటేశ్వర స్వామి చిత్ర పటానికి పూజలు చేసిన అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛరణాల మధ్య యూనివర్శిటీ వైస్​ ఛాన్సలర్​ గా డా. చంద్ర శేఖర్​  బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం రాష్ట్ర గవర్నర్​ డా. అబ్దుల్​ నజీర్​ను రాజ్​ భవన్​ లో మర్యాద పూర్వకంగా కలిశారు. గవర్నర్​ కు పుష్పగుచ్చం అందజేసి.. శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు.  ఈ సందర్భంగా వైస్​ ఛాన్సలర్​ డా. చంద్ర శేఖర్​ మాట్లాడుతూ డా. ఎన్టీఆర్​ హెల్త్​ యూనివర్శిటీ అభివృద్ధిలో తన మార్క్​ కనిపించేలా కృషి చేస్తానన్నారు.  ప్రొఫెసర్ల టీచింగ్​, విద్యార్థుల క్రమ శిక్షణ, ఉద్యోగుల విధులు , వైద్య పరిశోధనలు తదితర అంశాలలో క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటానని స్పష్టం చేసిన డా. పి. చంద్ర శేఖర్​…. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన విజనరీ సీఎం చంద్ర బాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్​ కళ్యాణ్​, రాష్ట్ర గవర్నర్​ డా. అబ్దుల్​ నజీర్​,  వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డా. సత్య కుమార్​ యాదవ్​, చీఫ్​ సెక్రటరి తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు.  

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *