PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

డా.పుల్లన్న సేవలు చిరస్మరణీయం.. : ఎంపీ గోరంట్ల మాధవ్​

1 min read

ల్లెవెలుగు వెబ్​, కర్నూలు: ప్రముఖ వైద్యులు, కర్నూలు జిల్లా కురువ సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ టి. పుల్లన్న సేవలు చిరస్మరణీయమన్నారు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్​. ఆదివారం రాత్రి డా. పుల్లన్న గుండెపోటుతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎంపీ గోరంట్ల మాధవ్​ సోమవారం డా. పుల్లన్న మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ డా. పుల్లన్న ప్రభుత్వం జనరల్ హాస్పిటల్ వైద్యుడిగా పని చేసి పదవీ విరమణ పొందారు. ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ గా పని చేశారు. జిల్లాలో మారుమూల గ్రామాలకు వెళ్లి వైద్య సేవలు అందించారు. అలాగే జిల్లా కురువ సంఘం అభివృద్ధికి విశేష కృషి చేశారు. సంఘంలో విశిష్టమైన సేవలు అందించారు. రాష్ట్ర వైద్య సంఘంలో ఉపాధ్యక్షుడిగా పని చేశారు. కర్నూలు మెడికల్ కాలేజ్ పూర్వ విద్యార్థుల సంఘం కోశాధికారిగా వున్నారు. 2017లో పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ గా పోటీ చేశారు.
ప్రముఖుల నివాళి…
హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ తోపాటు గద్వాల జడ్పీ చైర్మన్ సరిత, కర్నూలు మేయర్ బి వై రామయ్య, కురువ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జబ్బల శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు గుడిసె శివన్న, రాష్ట్ర కార్యదర్శి లింగమూర్తి, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దేవేందరప్ప, రంగస్వామి, కోశాధికారి నాగన్న, సిపిఐ రాష్ట్ర నాయకులు రామాంజనేయులు రామచంద్రయ్య, మాజీ జడ్పీ చైర్మన్ బత్తిన వెంకట రాముడు కల్లూరు మాజీ ఎంపీపీ పెద్ద అమీన్, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జిక్కి, ఆదర్శ రవీంద్ర విద్యా సంస్థల అధినేతలు తిమ్మయ్య పుల్లయ్య, అమిలియో ఆస్పత్రి అధినేత డాక్టర్ లక్ష్మి ప్రసాద్, కురువ సంఘం జిల్లా నాయకులు లక్ష్మన్న వెంకటకృష్ణ తవుడు శీను, రామకృష్ణ వీరేశ్ బుదురు లక్ష్మన్న, సుంకన్న తదితరులు డా. పుల్లన్న మృతదేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

About Author