డా .పుల్లన్న సేవలు మరువలేనివి
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: జిల్లా అధ్యక్షులు పత్తికొండ శ్రీనివాసులు ….. బి .సి .ల అభివృద్ధికి, ఎంతోమంది పేదలకు వైద్యసేవలు అందించారని మరియు కురువ సంఘానికి ఆయన చేసిన సేవలు మరువలేనివని కర్నూలు జిల్లా కురువ సంఘము అధ్యక్షులు పత్తికొండ శ్రీనివాసులు అన్నారు .మంగళవారం నగరం లోని టి .జి . వి . కళాక్షేత్ర సమావేశ భవనం లో కురువ సంఘం జిల్లా మాజీ గౌరవ అధ్యక్షులు డా .టి .పుల్లన్న ద్వితీయ వర్ధంతి నిర్వహించారు .ఈ సమావేశం లో జిల్లా అధ్యక్షులు పత్తికొండ శ్రీనివాసులు మాట్లాడుతూ కురువ సంఘం పురోభివృద్ధికి మరియు శ్రీ బీరప్ప స్వామి గుడి నిర్మాణం వారి ఆశయాలు నెరవేర్చేందుకు కృషి చేస్తామని చెప్పారు . డా .టి .పుల్లన్న ద్వితీయ వర్ధంతి సందర్బంగా జి .పుల్లారెడ్డి కళాశాల పక్కన ఉన్న మానసిక వికలాంగుల శరణాలయం లో కుటుంబసభ్యులు అన్నదానం ఏర్పాటు చేసారు . ఈ కార్యక్రమం లో టి .జి .వి కళాక్షేత్రం అధ్యక్షులు పతి ఓబులయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం .కే .రంగస్వామి ,కోశాధికారి కే .సి .నాగన్న ,జిల్లా ఉపాధ్యక్షులు బి .వెంకటేశ్వర్లు ,నగర అధ్యక్ష కార్యదర్శి తవుడు శ్రీనివాసులు ,బి .రామకృష్ణ ,టి .లీలమ్మ కురువ సంఘము నాయకులు బి .మల్లికార్జున ,కమలంకొండ సంతోష్ ,ఎం .సుంకన్న గొందిపర్ల రాంగోపాల్ ,సోమన్న ,పెద్దపాడు శ్రీనివాస్ ,చిన్నయ్య ,శేఖర్ ,నాగశేషులు,బాలరాజు ,బాలగురవయ్య ,రాజు , నాగయ్య ,ధనుంజయ ,పుల్లన్న ,దివాకర్ ,వెంకటేశ్వర్లు ,ఓర్వకల్ అల్లబాబు , ,కుటుంబసభ్యులు డా .టి .పుల్లన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు .