PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సామాజిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిగా డాక్టర్ సతీష్

1 min read

పల్లెవెలుగు, వెబ్ చెన్నూరు: చెన్నూరు చెన్నూరు సామాజిక ఆరోగ్య కేంద్రం( సిహెచ్ సి) వైద్యాధికారిగా డాక్టర్ సతీష్ బాధ్యతలు చేపట్టారు, ఇక్కడ పనిచేస్తున్న వైజాగ్ గారి డాక్టర్ ఎస్ వి కృష్ణారెడ్డి పదోన్నతి పై సత్యసాయి జిల్లా డిఎంహెచ్వో గా వెళ్లడం జరిగింది. కాగా డాక్టర్ సతీష్ లక్కిరెడ్డిపల్లె జనరల్ ఫిజీషియన్ గా పని చేస్తూ ఇక్కడికి బదిలీపై రావడం జరిగింది, ఈ సందర్భంగా ఆయన బుధవారం స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, మండల ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందించడమే తమ లక్ష్యం అని, అలాగే ఆస్పత్రిలో తగినంతమంది సిబ్బంది ఉండడం చేత ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆరోగ్య సేవలు అందించడం జరుగుతుందన్నారు, సిహెచ్ లో వైద్య పరికరాలు ఉండడం చేత ఇక్కడికి వచ్చే రోగులకు, అల్ట్రా సౌండ్, ఎక్స్రే రే తో పాటు మరిన్ని వైద్య పరీక్షలు నిర్వహించేందుకు అనుకూలంగా ఉందని ఆయన తెలిపారు, అంతేకాకుండా పెద్ద పెద్ద ఆపరేషన్లకు జబ్బులకు మినహా, మిగతా వాటన్నిటిని కూడా ఇక్కడే చికిత్స అందించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు, అదేవిధంగా ఆస్పత్రి సిబ్బంది చేత ఆస్పత్రి పరిశుభ్రంగా ఉంచేందుకు, ఆస్పత్రి నూతన భవనాలు సకాలంలో పూర్తి అయ్యి ప్రజలకు అందుబాటులోకి వచ్చే విధంగా కృషి చేయడం జరుగుతుందని ఆయన తెలియజేశారు.

About Author