డా.స్వరూపరాణి సేవలు..చిరస్మరణీయం..
1 min readప్రొఫెసర్ డా. రాజేష్
- పదవీ విరమణ పొందిన స్వరూపరాణిని ఘనంగా సన్మానించిన అధ్యాపకులు,విద్యార్థులు
కర్నూలు, పల్లెవెలుగు:కర్నూలు మెడికల్ కళాశాలలో 32 సంవత్సరాలపాటు అధ్యాపకురాలిగా ఫార్మావిద్యార్థులను మెరికల్లా తీర్చిదిద్దడంలో డా. స్వరూపరాణి పాత్రీ కీలకమన్నారు ప్రొఫెసర్ డా.రాజేష్. శుక్రవారం డా. స్వరూపరాణి పదవీ విరమణ సందర్భంగా ఫార్మామెడికల్ విద్యార్థులు, ప్రొఫెసర్లు ఆమెను ఘనంగా సన్మానించారు. శాలువ కప్పి పూలమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ డాక్టరుగా విధుల్లో చేరిన డా. స్వరూపరాణి నీతినిజాయితీ, నిబద్ధత.. క్రమశిక్షణతో పని చేసి ఎన్నో పదవులు అలంకరించిన ఘనత ఆమెకే దక్కిందన్నారు. భవిష్యత్లో ఆమె సేవలు వినియోగించుకుంటామని, ఇందుకు పూర్తిస్థాయిలో డా. స్వరూపరాణి సహకరించాలని మనసారా కోరుకుంటున్నామన్నారు. అనంతరం తోటి అధ్యాపకులు మాట్లాడుతూ డా. స్వరూపరాణి బోధనవిధానం ఎందరికో ఆదర్శమన్నారు. ఆమె సేవలు మరువలేమన్నారు. ఆ తరువాత పి.జి విద్యార్థులు మాట్లాడుతూ అధ్యాపకురాలి బోధన పటిమ అద్భుతమన్నారు. ఆతరువాత డా. స్వరూపరాణి మాట్లాడుతూ డిపార్ట్మెంట్ మొత్తం ఒక కుటుంబ సభ్యురాలిగా తనను ఆదరించడం ఆనందంగా ఉందన్నారు. పదవీ విరమణ పొందినా… తన సేవలు మెడికల్ కాలేజికి అవసరమైతే తప్పకుండా అందజేస్తానన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్లు, పిజి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.