NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ద్రౌప‌ది ముర్ము ఘ‌న విజ‌యం

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : 15వ రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము తిరుగులేని మెజారిటీతో విజయం సాధించారు. గురువారం పది గంటల పాటు జరిగిన ఓట్ల లెక్కింపులో ఆమె 64 శాతం ఓట్లు సాధించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలతో కూడిన ఎలకో్ట్రరల్‌ కాలేజీలో ఆమెకు 6,76,803 ఓట్లు దక్కగా, ప్రత్యర్థి, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాకు 3,80,177 ఓట్లు లభించాయి. రిటర్నింగ్‌ అధికారి పీసీ మోదీ అధికారికంగా ద్రౌపది ముర్మును విజేతగా ప్రకటించారు. ఇప్పటివరకు రాష్ట్రపతి పదవిని అధిరోహించిన వారిలో ముర్ముయే అత్యంత పిన్న వయస్కురాలు. ఆమెకు ముందున్న రాష్ట్రపతులంతా స్వాతంత్య్రం రాకముందు జన్మించిన వారు కాగా ఆమె స్వాతంత్ర్యానంతర తరానికి చెందిన వారు.

                                      

About Author