పూర్తి అయిన ఇండ్లను పరిశీలించిన డిఆర్డిఏ పీడీ
1 min read– విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మండలంలోని కాజీపేట, 49బన్నూరు,కలమందలపాడు,చింతలపల్లి,నాగలూటి గ్రామాలలో జగనన్న కాలనీలలో పూర్తి అయిన 68 ఇండ్లను శనివారం నంద్యాల జిల్లా డిఆర్డిఏ మరియు వైకెపి ప్రాజెక్టు డైరెక్టర్ వైబి శ్రీధర్ రెడ్డి ఇండ్లను పరిశీలించారు.అదేవిధంగా గ్రామాల్లో నాడు నేడు మొదటి దశలో భాగంగా వివిధ పాఠశాలల్లో చేసిన పనులను మరియు గుడ్లు బియ్యం మరుగుదొడ్లను ఆయన పరిశీలించారు.అదేవిధంగా ప్రాథమిక పాఠశాలల్లో జగనన్న గోరుముద్ద రికార్డులను ప్రాజెక్టు డైరెక్టర్ తనిఖీ చేశారు.పాఠశాలల్లో విద్యార్థులకు శుభ్రంగా వంట చేస్తూ నాణ్యమైన భోజనాన్ని అందించాలని అంతేకాకుండా గుడ్లు చెడిపోయిన వాటిని తొలగించి మంచి గుడ్లనే పిల్లలకు అందించాలని పీడీ ప్రధానోపాధ్యాయులకు సూచించారు.పూర్తి చేయని గృహాల లబ్ధిదారులు ముందుకు వచ్చి త్వరగా ఇండ్లు పూర్తి చేయాలని అన్నారు.ఈకార్యక్రమంలో ఎంపీడీఓ జిఎన్ఎస్ రెడ్డి,ఏపిఎం సుబ్బయ్య,హౌసింగ్ ఇంచార్జ్ ఏ ఈ జె.రమేష్,ఆర్డబ్ల్యూఎస్ ఏఈ విశ్వనాథ్,వైకేపి సీసీలు,పంచాయతీ కార్యదర్శులు,వర్క్ ఇన్స్పెక్టర్లు,ఇంజనీరింగ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.