`టీ` తక్కువ తాగండి !
1 min readపల్లెవెలుగువెబ్ : టీ తక్కువ తాగమని పాకిస్థాన్ దేశ ప్రణాళిక శాఖ మంత్రి అహ్సాన్ ఇక్బాల్ ప్రకటన చేశారు. ఈ విజ్ఞప్తిపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ‘‘తక్కువ టీ తాగండి, డబ్బు ఆదా చేసుకోండి’’ అంటూ పాక్ మంత్రి అహ్సాన్ ఇక్బాల్ చేసిన విజ్ఞప్తి పాక్ ప్రజలను ఆశ్చర్యపరిచింది. ఒక పాకిస్థానీ రోజుకు సగటున కనీసం మూడు కప్పుల టీ తాగుతాడని అంచనా. 220 మిలియన్ల జనాభా ఉన్న పాక్ దేశంలో ధనిక, పేదలకు అత్యంత ప్రజాదరణ పొందిన పానీయం టీ. ప్రపంచంలోని టాప్ టీ దిగుమతిదారులలో పాకిస్థాన్ ఒకటి. తేయాకు దిగుమతుల కోసం పాకిస్థాన్ ప్రభుత్వం సెంట్రల్ బ్యాంక్ హార్డ్ కరెన్సీ నిల్వల నుంచి దాదాపు 600 మిలియన్ డాలర్లను ఖర్చు చేయాల్సి వస్తోంది.