సత్యసాయి త్రాగునీటి ప్రాజెక్ట్ కింద 151 గ్రామాలకు త్రాగునీరు..
1 min read– గ్రామాల్లో ప్రభుత్వ అభివృద్ధి పనులు జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలి..
– జిల్లా ప్రజాపరిషత్ స్ధాయి సంఘాల సమావేశంలో
– జెడ్పి చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ వెల్లడి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ఐదు కోట్లతో 2021లో చేపట్టిన సత్యసాయి త్రాగునీటి ప్రాజెక్ట్ కింద 151 గ్రామాలకు 4 లక్షల 52 వేల మందికి త్రాగునీరు అందించడం జరిగిందని జెడ్పి చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ వెల్లడించారు. శనివారం ఉదయం ఏలూరు జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజాపరిషత్ స్ధాయి సంఘాల సమావేశం జెడ్పి చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ ఆధ్వర్యంలో జెడ్పిటిసి, అధికారులతో మొత్తం 7 స్ధాయి సంఘాలకు సంబంధించిన సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశంలో చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ మాట్లాడుతూ ఐదు కోట్లతో 2021లో చేపట్టిన సత్యసాయి త్రాగునీటి ప్రాజెక్ట్ కింద 151 గ్రామాలకు 4 లక్షల 52 వేలమందికి జెడ్పి చైర్ పర్సన్ గా బాధ్యతలు చేపట్టిన రెండు మాసాల్లోనే త్రాగునీరు అందించడం జరిగిందని ఆమె తెలిపారు. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాలకు అందజేస్తున్న అభివృద్ధి పనులలో జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేసేలా అధికారులు కృషి చేయాలని ఆమె కోరారు. ఈ సమావేశంలో ఆర్ధిక, ప్రణాళిక, గ్రామీణాభివృద్ధి, విద్యా, వైద్యం, పనులు, పారిశుద్యం, జాతీయ ఉపాధిహామీ పధకం, వైద్యం, ఆరోగ్యం, హౌసింగ్, విద్యుత్, గ్రామీణ అభివృద్ధి తదితర అంశాలలో ఇప్పటి వరకు జరిగిన పురోగతి, కొత్తగా ప్రతిపాధించిన పనుల వివరాలు, అధికారులద్వారా సమావేశంలో చర్చించడం జరిగింది. అదే విధంగా రైతులకు అమలు పధకాలు, చేపట్టిన పనులు వాటి పురోగతిని సభ్యులకు అధికారులు వివరించడం జరిగింది. అదే విధంగా సాంఘీక సంక్షేమ శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, రోడ్లు, భవనాలు, మైన్స్, సివిల్ సప్లయిస్, పంచాయితీరాజ్ చేపట్టిన పురోగతిని, వాటికి సంబంధించిన జెడ్పిటిసిలు లేవనెత్తిన సమస్యలపై అధికారులు వివరణ ఇప్వడం జరిగింది. ఈ సమావేశంలో జెడ్పి సిఇఓ కె. రవికుమార్, సిపిఓ శ్రీనివాస్, ఇంఛార్జి డిఆర్ఓ జివివి సత్యనారాయణ, డిఎస్ఓ సత్యనారాయణరాజు, సివిల్ సప్లయిస్ డియం మంజూభార్గవి, ఆర్ డబ్ల్యూఎస్ ఎస్ఇ సత్యనారాయణ, డిపివో తూతిక శ్రీనివాస్ విశ్వనాధ్, తదితర ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధికారులు, జెడ్పిటిసిలు తదితరులు పాల్గొన్నారు.