కూల్ డ్రింక్ బాటిల్లో నీరు పోసుకుని తాగుతున్నారా ?
1 min readపల్లెవెలుగువెబ్ : చల్లని నీటి కోసం పాత నీటి బాటిళ్లను ఉపయోగిస్తున్నారా?. ఇలా చేయడం హానికరమని మీకు తెలుసా?. ప్లాస్టిక్ బాటిల్‌లో ఉంచిన నీరు మనిషి రోగనిరోధక వ్యవస్థపై పెను ప్రభావాన్ని చూపుతుందని పలు నివేదికలలో వెల్లడైంది. ప్లాస్టిక్ బాటిల్ ఉత్పత్తి చేసే రసాయనాలు శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ప్లాస్టిక్‌లో థాలేట్స్ వంటి రసాయనాలు ఉండటం వల్ల కాలేయ క్యాన్సర్ వచ్చే ముప్పు అధికంగా ఉంటుంది. ఈ బాటిళ్లలో నీటిని ఎక్కువ సేపు ఉంచడం వల్ల బీపీఏ ఏర్పడుతుంది.. అంటే బైఫినైల్ ఏ. ఇది మీ శరీరంలో స్థూలకాయం, మధుమేహం తదితర వ్యాధులకు కారణమయ్యే ఒక రకమైన రసాయనం. అంతే కాకుండా ఈ బాటిళ్లలో నీరు వేడెక్కినప్పుడు లేదా సూర్యరశ్మిని తాకినప్పుడు అది విషాన్ని ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తుంది, ఇది క్యాన్సర్‌కు కూడా కారణమవుతుంది.