వేసవికాలం లో.. త్రాగునీటి సమస్య తలెత్తకుండా చూస్తాం..
1 min read
పల్లెవెలుగు , పత్తికొండ: రానున్న వేసవికాలం దృష్టిలో ఉంచుకొని త్రాగునీటి సమస్య తలెత్తకుండా చూస్తానని మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ చలవాది రంగమ్మ పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ గౌడ్ వార్డ్ మెంబర్ హమీద్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాలుగు వార్డులో గత కొంతకాలంగా బోరు పని చేయకపోవడంతో ఆ కాలనీవాసులకు నీళ్ల కోసం తీవ్ర సమస్యలు ఎదుర్కొన్నారు ఆ సమస్యలను దృష్టిలో ఉంచుకొని బోరును మరమ్మతు చేయించమన్నారు. అలాగే వార్డులలో ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని త్రాగునీరు పైపు లీకేజీ వీధిలైట్లు డ్రైనేజీ పరిశుభ్రత తదితర సమస్యలుంటే వెంటనే మరమ్మతులు చేస్తామని వారు తెలిపారు గ్రామంలోని తడి చెత్త పొడి చెత్త బహిరంగ ప్రదేశాల్లో వేయకూడదని పంచాయతీ ఆటో ట్రాక్టర్ వస్తాయి దాంట్లో వేయాలని వారు సూచించారు.