హరిజనవాడలో త్రాగునీటి సమస్య
1 min read– వారం రోజులుగా త్రాగు నీటి కోసం ఇబ్బందులు పడుతున్న గ్రామ ప్రజలు
– పట్టించుకోని అధికారులు
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : మండలంలోని శివాల పల్లి హరిజనవాడలో త్రాగునీటి కోసం అక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు, వారం రోజులుగా తాగునీరు సరఫరా నిలిచిపోవడం జరిగిందని అక్కడి స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, త్రాగునీటి కోసం సుమారు కిలోమీటర్ దూరంలో ఉన్న శ్రీ కాశీ విశ్వనాథ ఆలయం వద్దకు వెళ్లి నీటిని తెచ్చుకుంటూ ఉన్నామని అక్కడి ప్రజలు వాపోయారు, అక్కడ కూడా నీరు రాకపోతే నాలుగు కిలోమీటర్లు దూరం వెళ్లి నీరు తెచ్చుకోవడం జరుగుతుందని, ఇందుకోసం పనులు మానుకొని ద్విచక్ర వాహనాలలో, ఆటోలలో వెళ్లి నీళ్లు తెచ్చుకోవడం జరుగుతుందని వారు తెలిపారు, దీనికోసం పనులు మానుకోవడం జరుగుతుందని, రెక్కాడితే డొక్కాడని కుటుంబాలు తమవి అని, ఇలా పనులు మానుకొని త్రాగునీటి వెంపర్ల డుకోవడం జరుగుతుందని వారు తెలిపారు, పూర్తిగా దళితులు ఉండే కాలనీ కాబట్టి అధికారులు మాపై దృష్టి సారించడం లేదని, ఈ విషయమై గ్రామ సచివాలయంలో అధికారుల దృష్టికి తీసుకుపోయినప్పటికీ వారు తమ విషయాన్ని పెడచెవిన పెట్టినట్లు అక్కడి దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు త్రాగునీటి సమస్య పరిష్కరించాలని అక్కడ ప్రజలు అధికారులు ను కోరుతున్నారు.