మహానంది క్షేత్రంలో డ్రోన్ కలకలం
1 min read
పల్లెవెలుగు వెబ్: మహానంది క్షేత్రంలో మంగళవారం రాత్రి డ్రోన్ చెక్కర్లు కొట్టినట్లు విశ్వసనీయ సమాచారం. రాత్రి 9 గంటలు దాటిన తర్వాత డ్రోన్ మహానంది క్షేత్ర పరిధిలో తిరిగినట్లు తెలుస్తుంది. ఎవరు ఎగరవేశారు ఎందుకు ఎగరవేశారు అనేది తెలియ రాలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మబ్బులు ఉండడంతో డ్రోన్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియ రావడంలేదని సమాచారం. సంబంధిత ఆలయ అధికారులను వివరణ కోరగా తమ దృష్టికి రాలేదన్నారు.