మైనారిటీ విద్యార్థులకు డ్రోన్ పైలెట్ ప్లేస్మెంట్స్
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: స్థానిక కర్నూలులోని ఉస్మానియా కళాశాలలోని రీజనర్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్ (RCEDM) వారి ఆధ్వర్యంతో మైనారిటీ విద్యార్థులకు ఉచితముగా డ్రోన్ పైలెట్ శిక్షణ 45 రోజులు ఇవ్వడం జరిగినది ఈ శిక్షణలే 44 మంది విద్యార్థులు ఉచితముగా శిక్షణ తీసుకున్నారు . శిక్షణ ముగిసిన అనంతరం విద్యార్థులకు ప్లేస్మెంట్స్ నిర్వహించబడినది. ఈ ప్లేస్మెంట్స్ Centurian Universty, Green ko కంపెనిలో 30 మంది విద్యార్థులు సెలెక్ట్ అవ్వడం జరిగినది. ప్లేస్మెంట్ లెటర్లను, సర్టిఫికెట్స్ ను స్థానిక కర్నూలు MLA హఫీజ్ ఖాన్ గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగినది. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే గారికి ముందుగా శాలువా మరియు బొకేలతో స్వాగతం పలికారు.MLA గారు మాట్లాడుతూ మైనారిటీ విద్యార్థులకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు ఆంధ్రప్రదేశ్ CM YS జగన్ మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు ఆయన మాట్లాడుతూ. మైనారిటీ విద్యార్థుం భావితరాల భవిష్యత్తు కోసం ఈ ప్రభుత్వం మైనారిటీలకు ఎంతో తోడ్పడుతుందని తెలియజేశారు కాబట్టి మైనారిటీ విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ సంస్థ RCEDM డిప్యుటీ డైరక్టర్ సయ్యద్ సమీవుద్దిన్ ముజమ్మిల్ గారు మాట్లాడుతూ ఈ అవకాశాన్ని కల్పించేందుకు ఎంతో కృషి చేసిన AP CM YS జగన్మోహన్ రెడ్డి గారికి, డిప్యూటీ CM మైనారిటీస్ వెల్ఫేర్ మినిస్టర్ అంజాద్ బాషా గారికి , మైనారటీస్ వెల్ఫేర్ ప్రిన్సపల్ సెక్రెటరీ AMD ఇంతియాజ్ గారికి, కర్నూలు MLA హఫీజ్ ఖాన్ గారికి, మరియు CEDM డైరక్టర్ మస్తాన్ వలి గారికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ గారు, డిస్ట్రిక్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ సయ్యద్ సబహా పర్వన్, మరియు RCEDM డిప్యూటీ డైరక్టర్ సయ్యద్ సమీవుద్దిన్ ముడమ్మర్, మరియు RCEPM సిబ్బంది పాల్గొన్నారు.