NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పాక్ లోని భార‌త ఎంబసీ పై డ్రోన్ క‌ద‌లిక‌లు.. భార‌త్ ఆగ్రహం

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : పాకిస్థాన్​లో ఉన్న భార‌త ఎంబసీపై డ్రోన్ల క‌ద‌లిక‌లు క‌ల‌క‌లం రేపాయి. ఇస్లామాబాద్​లోని ఇండియ‌న్ హైక‌మిష‌న్ కంపౌండ్లో డ్రోన్లు సంచ‌రించినట్టు స‌మాచారం. ఈ ఘ‌ట‌న‌పై భార‌త్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. డ్రోన్ల సంచారం పై పూర్తీ విష‌య‌లు తెలియాలి. భార‌త ఎంబ‌సీ అధికారులు ఈ విష‌య‌మై ఆరా తీస్తున్నట్టు స‌మాచారం. జ‌మ్మూలోని ఎయిర్ ఫోర్స్ స్టేష‌న్ పై జూన్ 27న మొద‌టిసారి డ్రోన్లతో దాడి జ‌రిగింది. డ్రోన్ల స‌హాయంతో వైమానిక ద‌ళం పై దాడికి య‌త్నించారు. జ‌మ్మూలోని వివిధ ప్రాంతాల్లో డ్రోన్లు ఉన్నట్టు ఆర్మీ తెలిపింది. డ్రోన్ల సంచారంతో భార‌త ఆర్మీ అల‌ర్ట్ అయింది.

About Author