వ్యవ`సాయం`లో డ్రోన్లు.. 5 గంటల పని ఐదు నిమిషాల్లో.. !
1 min readపల్లెవెలుగువెబ్ : వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగంపై హైదరాబాద్‌లో కోరమాండల్ ఇంటర్నేషనల్ ప్రయోగాలు చేసింది. ఎరువులు వంటివి వృథా కాకుండా.. కచ్చితమైన నిర్ణయాలు తీసుకుని వ్యవసాయం చేయడానికి డ్రోన్ టెక్నాలజీ దోహ దం చేస్తుందని కోరమాండల్ ఇంటర్నేషనల్ ఎండీ సమీర్ గోయెల్ తెలిపారు. వ్యవసాయ మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాల కారణంగా వ్యవసాయ రంగంలో తక్కువ ఖర్చుతో డ్రోన్ల వినియోగం సాధ్యమవుతుందని చెప్పారు. చిన్న కమతాలు ఉండే భారత్ వంటి దేశాల్లో డ్రోన్లు బాగా ఉపయోగపడతాయి. వ్యవసాయ కార్మికుల కొరత వంటి సమస్యలను అధిగమించవచ్చన్నారు. సాధారణంగా ఒక ఎకరా పంటకు ఎరువులు, పురుగు మందులు వంటివి చల్లాలంటే 5-6 గంటలు పడుతుంది. డ్రోన్లతో కొద్ది నిమిషాల్లో పూర్తవుతుందని గోయెల్ అన్నారు.