తుగ్గలి మండలాన్ని కరువు మండలంగ ప్రకటించాలని ధర్నా
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: తుగ్గలి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని కోరుతూ, విపక్ష పార్టీల ఆధ్వర్యంలో సోమవారం పత్తికొండ ఆర్డిఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. టిడిపి, సీపీఐ, సిపిఎం, జనసేన ఎమ్మార్పీఎస్ఎస్ అఖిలపక్ష పార్టీలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రైతులు పత్తికొండ ఆర్డీవో కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున నిరసన తెలిపి ధర్నా చేపట్టిఆర్డీవోకార్యాలయాన్ని ముట్టడించారు.అనంతరం ఆర్డిఓ రామలక్ష్మి గారికి డిమాండ్లతోకూడినవినతిపత్రంఅందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి బి గిడ్డయ్య మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎప్పుడూ లేనివిధంగా పరువు పరిస్థితులు ఏర్పడినా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విచారకరమన్నారు. రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతంలో కరువు పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయన్నారు. కేవలం కొన్ని మండలాలు మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించి మిగతా మండలాలను కరువు మండలాలుగా ప్రకటించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. కర్నూలు జిల్లాలోని తుగ్గలి మండలం కరువు దుర్భిక్ష పరిషత్తులు కళ్ళకు కనపడుతుండగా రాష్ట్ర ప్రభుత్వం తుగ్గలి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కర్నూలు జిల్లాలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని, అలాగే తక్షణమే కరువు సహాయక చర్యలు చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలా కాని ఎడల అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో మున్ముందు పెద్ద ఎత్తున రైతులతో చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష పార్టీల నాయకులు రంగారెడ్డి, బత్తిని వెంకట రాముడు నబి రసూల్, సుల్తాన్, వెంకటేశ్వర్లు, స్థానిక నాయకులు శ్రీరాములు, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.