ముంచిన తుఫాన్… ‘వరి’ నాశనం..!
1 min readభోరున విలపిస్తున్న భాకారాపురం రైతులు..
పల్లెవెలుగు, వల్లూరు:తుఫాను ప్రభావంతో కురిసిన వర్షం తాకిడికి చేతికి వచ్చిన వరి పంట నాశనం అయిందని భాకరాపురం రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పది రోజుల్లో పంట నూరుపిల్లు జరిగి ఉండేవని తీరా కోత దశలో వర్షం తాకిడికి పూర్తిగా నష్టపోయాం అన్నారు. ఇప్పటికే ఎకరాకు 30 నుంచి 35 వేల వరకు పంట సాగు కోసం ఖర్చు చేశామన్నారు. విపరీతంగా విచిన గాలులు వర్షం తాకిడికి వరి కర్రలు భూమిపైకి వాలడంతో గింజలు మోసులు వచ్చాయన్నారు పూర్తిగా తడిసిపోయిన వరి వల్ల ఇప్పుడు పంట నూరుపిల్లు చేసిన ప్రయోజనం లేదని రైతులు తెలిపారు. సుమారుగా ఈ గ్రామానికి సంబంధించి 200 ఎకరాలకు పైబడి వరి పంట దెబ్బతినింది. ఇంకా మండలంలో ఆయా గ్రామాల్లో సాగు అయిన వరి పంట ఈ వర్షం తాకిడి వల్ల రైతులు పూర్తిగా నష్టపోయారు వరి పంట సాగు చేసి నష్టపోయిన రైతుల వివరాలను వ్యవసాయ అధికారులు సేకరించి రైతులకు పంట నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాలు కూడా రైతుల పరిస్థితిని గమనించి ఆదుకోవాలని కోరారు..