మునిగిపోయిన తేలియాడే రెస్టారెంట్ !
1 min readపల్లెవెలుగువెబ్ : హాంకాంగ్‌కు చెందిన అతిపెద్ద తేలియాడే రెస్టారెంట్ దక్షిణ చైనా సముద్రంలో మునిగిపోయింది. దాదాపు అర్ధ శతాబ్దంపాటు ఐకానిక్ ల్యాండ్‌మార్క్‌గా ఉన్న ఈ జంబో ఫ్లోటింగ్ రెస్టారెంట్ మునిగిపోవడంపై దాని పేరెంట్ కంపెనీ అబెర్డీన్ రెస్టారెంట్ ఎంటర్‌ప్రైజెస్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ ఘటనలో సిబ్బంది ఎవరూ గాయపడలేదని తెలిపింది. నౌక శనివారం దక్షిణ చైనా సముద్రంలోని పారాసెల్ ఐలాండ్స్ మీదుగా ప్రయాణిస్తుండగా ప్రతికూల వాతావరణం ఎదురైంది. దీంతో నౌకలోకి నీళ్లు చొచ్చుకు రావడంతో క్రమంగా మునిగిపోవడం ప్రారంభమైనట్టు కంపెనీకి సమాచారం అందింది. దానిని రక్షించే ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని, ఆదివారం అది మునిగిపోయినట్టు కంపెనీ తెలిపింది.