PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ముంచుకొస్తోన్న విద్యుత్​ సంక్షోభవం.. అప్రమత్తమైన కేంద్రం!

1 min read

పల్లెవెలుగువెబ్​, ఢిల్లీ: బొగ్గు కొరత వల్ల రానున్న రోజుల్లో దేశంలో విద్యుత్​ సంక్షోభం తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉండడంతో కేంద్రం అప్రమత్తమయింది. ముంచుకొస్తున్న విద్యుత్​ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కేంద్ర మంత్రుత్వ శాఖ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈమేరకు మంగళవారం అన్ని రాష్ట్రాలకు కొన్ని మార్గ సూచనలు జారీ చేసింది. దేశంలో బొగ్గు కొరత కారణంగా ఎదురయ్యే విద్యుత్​ సంక్షోభాన్ని అధిగమించేందుకు అన్ని రాష్ట్రాలు విద్యుత్​ సర్దుబాటుకు సమన్వయం చేసుకోవాలని కేంద్రం కోరుతోంది. విద్యుత్​ మిగులు రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలకు కరెంట్​ సాయం అందించాలని అభిప్రాయపడింది. బొగ్గు కొరత నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు లోడ్​ సర్దుబాటు కింద కోతలు విధిస్తూ సదరు విద్యుత్​ను అధిక ధరలకు విక్రయింస్తున్నాయన్న విషయం తమ దృష్టికి వచ్చినట్లు పేర్కొంది. అలాంటి రాష్ట్రాలు ముందుగా తమ వినియోగదారులకు 24గంటల కరెంట్​ సరపరా చేయకుండా విద్యత్​ను విక్రయించకోవద్దని సూచించింది. వినియోగదారులకు అవసరమైన విద్యుత్​ను సరఫరా చేయకుండా అక్రమ విక్రయాలకు పాల్పడే రాష్ట్రాలపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరించింది. విద్యుత్​ కేటాయింపు మార్గదర్శకాల కింద… కేంద్ర ఉత్పాదక కేంద్రాల వద్ద ఏ రాష్ట్రాలకు కేటాయించని 15శాతం విద్యుత్​ ఉందని, అత్యవసర సమయాల్లో కేంద్రం సదరు విద్యుత్​ను అవసరమైన రాష్ట్రాలకు ఇవ్వనున్నట్లు పేర్కొంది.
రాష్ట్రానికి విద్యుత్​ సమస్య తప్పదు.. మంత్రి బాలినేని
అమరావతి:
దేశంలో నెలకొన్న బోగ్గు కొరత నేపథ్యంలో రాష్ట్రానికి ఏదో ఒక స్థాయిలో విద్యుత్ కోతల సమస్య తప్పదని రాష్ట్ర విద్యుత్​శాఖ మంత్రి బాలినేని అన్నారు. అయితే రాష్ట్రంలో విద్యుత్​ సంక్షోభం తక్కువ రోజులే ఉంటుందని స్పష్టం చేశారు. బొగ్గు కొరత దృష్ట్యా రాష్ట్రంలో నెలకొన్న ఇబ్బందులు త్వరలోనే తొలగిపోతాయని మంత్రి తెలిపారు. సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం అన్నిచర్యలు తీసుకుంటుందన్నారు. ఏపీలోని ధర్మత్​ కేంద్రాలను బొగ్గు కొరత వల్లే మూసివేసినట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే రాయలసీమ థర్మల్​ కేంద్రంలో వార్షిక మెయిన్​టెనెన్స్​ పనులు చేపట్టామన్నారు. అయితే తెలంగాణకు బొగ్గు కొరత లేదని, అక్కడి బొగ్గును ఏపీకి ఇవ్వడం లేదని ఆరోపించారు. శ్రీశైలంలో మాత్రమే విద్యదుత్పత్తి చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.

About Author