PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎయిర్ పోర్టులో డ్రగ్స్ క‌ల‌క‌లం.. భారీగా ప‌ట్టివేత‌

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: హైద‌రాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా మాద‌క‌ద్రవ్యాలు ప‌ట్టుబ‌డ్డాయి. 15 రోజుల వ్యవ‌ధిలో డ్రగ్స్ పెద్ద మొత్తంలో ప‌ట్టుబ‌డ‌టం ఇది రెండోసారి. డీఆర్ఐ అధికారులు 3 కిలోల హెరాయిన్ ను ప‌ట్టుకున్నారు. టాంజానియా దేశానికి చెందిన జాన్ విలియ‌మ్స్ నుంచి ఈ హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. ప‌క్కా స‌మాచారంతో జాన్ విలియ‌మ్స్ ను త‌నిఖీలు చేయ‌గా.. హెరాయిన్ ఉన్నట్టు గుర్తించారు. ప‌ట్టుబ‌డ్డ హెరాయిన్ విలువ 20 కోట్లు ఉంటుంద‌ని అంచ‌నా. ఈనెల 5వ తేదీన జింబాంబ్వేకి చెందిన ఇద్దరు మ‌హిళ‌ల వ‌ద్ద 78 కోట్లు విలువైన హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్టు స‌మాచారం.

About Author