డ్రగ్స్ కేసు.. ఈడీ ముందుకు బండ్ల గణేష్, పూరీ జగన్నాథ్
1 min read
పల్లెవెలుగు వెబ్: డ్రగ్స్ కేసులో ఈడీ ముందుకు పూరీ జగన్నాథ్, బండ్ల గణేష్ హాజరయ్యారు. మొదట పూరీ జగన్నాథ్, ఆయన అకౌంటెంట్ శ్రీధర్ ను ఈడీ అధికారులు పలుకోణాల్లో ప్రశ్నిస్తున్నారు. తొమ్మిది గంటలకు పైగా విచారణ సాగింది. 2015 నుంచి తన బ్యాంకు వివరాలను ఈడీ అధికారులకు పూరీ జగన్నాథ్ ఇచ్చారు. విచారణ పూర్తీ అవ్వకపోతే మరోసారి విచారణకు పూరీ జగన్నాథ్ ను పిలిచే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. ఆర్థిక లావాదేవీల గురించి ప్రశ్నిస్తున్న సమయంలో పూరీ జగన్నాథ్.. బండ్ల గణేష్ పేరు ప్రస్తావించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో బండ్ల గణేష్ ను కూడ ఈడీ అధికారులు విచారణకు పిలిచారు. అయితే బండ్ల గణేష్ ను ఈ విషయం పై ప్రశ్నించగా.. పూరీ జగన్నాథ్ ను కలవడానికే వచ్చినట్టు ఆయన తెలిపారు.