NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

డ్రగ్స్, లంచం తీసుకున్నా..క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు !

1 min read

పల్లెవెలుగువెబ్ : జింబాంబ్వే క్రికెట్ మాజీ కెప్టన్ బ్రెండన్ టేలర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మ్యాచ్ ఫిక్స్ చేసేందుకు తాను భారత వ్యాపారవేత్త నుంచి 15 వేల డాలర్లు తీసుకున్నానని, దీంతో పాటు కొకైన్ కూడ తీసుకున్నట్టు వెల్లడించాడు. జింబాబ్వేలో టీ20 పోటీల నిర్వహణకు సంబంధించి చర్చించేందుకు భారతీయ వ్యాపారవేత్త ఒకరు తనను అక్టోబరు 2019లో ఆహ్వానించారని, చర్చల సందర్భంగా తనకు 15 వేల డాలర్లు ఇస్తామన్నారని పేర్కొన్నాడు. అప్పటికే తమకు ఆరు నెలలుగా వేతనాలు లేవని, జింబాబ్వే జట్టు ఇక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడే అవకాశం లేదన్న ఆందోళనలు మొదలయ్యాయని పేర్కొన్నాడు. అలాంటి సమయంలో ఈ ఆహ్వానం తనకు వచ్చిందన్నాడు. అంతకుముందు రోజు రాత్రి డ్రింక్స్ సందర్భంగా తనకు, తన సహచరులకు ఆ వ్యాపారవేత్త కొకైన్ కూడా ఇచ్చాడని, తాము తలివి తక్కువగా వాటిని తీసుకున్నామని టేలర్ అన్నాడు. ఆ తర్వాతి రోజు ఉదయం ఆ వ్యాపారవేత్త నేరుగా తన హోటల్ రూముకు వచ్చాడని పేర్కొన్నాడు. అంతకుముందు రోజు రాత్రి తాను కొకైన్ తీసుకుంటున్నప్పటి వీడియో చూపించాడని, తమ కోసం అంతర్జాతీయ మ్యాచ్‌లు ఫిక్స్ చేయకుంటే ఆ వీడియోను బహిరంగ పరుస్తానని హెచ్చరించాడని గుర్తు చేసుకున్నాడు.

About Author