PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మాదక ద్రవ్యాలు… సోషల్ మీడియా దుర్వినియోగంపై వర్కుషాప్..

1 min read

నవజీవన్ బాల భవన్ ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ఆశా, ఆరోగ్య కార్యకర్తలకు..

సరైన అవగాహనతో రుగ్మతాలను దూరం చేయొచ్చు..

నవజీవన్ ప్రోగ్రాం మేనేజర్ గొల్లమూడి శేఖర్ బాబు

విద్యార్థులు, యువత మాదకద్రవ్యాలకు బానిసలు అవుతున్నారు..

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  :  చాటపర్రు గ్రామంలో మంగళవారం నవజీవన్ బాల భవన్ ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆశ కార్యకర్తలకు, మాదకద్రవ్యాలు సోషల్ మీడియా దుర్వినియోగం పై వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమములో నవజీవన్ బాల భవన్ ప్రోగ్రాం మేనేజర్ గోళ్ళమూడి శేఖర్ బాబు   మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు మరియు సోషల్ మీడియా వ్యసనం ఒక మానసిక రుగ్మత, అని సరి అయిన అవగాహనతో ఈ రుగ్మతలను కట్టడి చేయవచ్చు అని అన్నారు, మాదక ద్రవ్యాలు జీవితాన్ని నాశనం చేస్తాయని, అంతేకాక  మనం నిత్యజీవితంలో చాలా మంది విద్యార్థులు మరియు యువత మాదక ద్రవ్యాలకు బానిసలై పోతున్నారు అని, సరి అయిన అవగాహనతో మాదకద్రవ్యాలను కట్టడి చేయవచ్చు అని,  మత్తు మైకంలో చదువుకు దూరమవుతూ విలువైన శక్తిని నిర్వీర్యం చేసుకుంటున్నారు అని,  మాదక ద్రవ్య వ్యానపరులను గుర్తించి వారిని సంబంధిత పునరావాస కేంద్రాలను సంప్రదించి చికిత్స ద్వారా సాధారణస్థితికి తీసుకురావాలని, ఎవరైనా మాదక ద్రవ్యాల కు బానిసలైన వారిని ముందుగా గుర్తించి, సరి అయిన అవగాహనా, కౌన్సిలింగ్ మరియు డి అడిక్షన్ సెంటర్లకు పంపించాలని ప్రతి ఒక్కరు తమ వంతు సామజిక భాద్యతగా తీసుకుంటే మాదకద్రవ్యాల వినియోగాన్ని నివారించవచ్చన్నరు. మాదక ద్రవ్యాలు మరియు సోషల్ మీడియా ప్రభావం మంచికంటే మనకి కీడు ఎక్కువగా  చేస్తుంది అని,  మత్తు పదార్ధాలు మనకి ప్రస్తుత కాలంలో అన్ని ప్రదేశాలలో అందుబాటులో ఉంటున్నాయి అని, వ్యక్తులలో ఒంటరితనం, డిప్రెషన్‌కు సోషల్ మీడియా కారణమవుతుంది. తద్వారా అనేక మందిలో నిద్ర లేమికి కారణమవుతుందని అనేక అధ్యయనాలు పేర్కొంటున్నాయి. సోషల్ మీడియాతో వచ్చే దుష్ప్రభావాలు వెనకబడిపోతున్నామనే భయం, ఒంటరితనం, నిరాశ మరియు ఆందోళన, సైబర్ బెదిరింపులు ఉంటాయి అని, సోషల్ మీడియా ప్రతికూల ప్రభావాలను అలవాటును నివారించవచ్చని అన్నారు. అనంతరం జోనల్ కోఆర్డినేటర్ B నేహీమియా, వాసే జయపాల్ మాట్లాడుతూ మానసిక సమస్యలకు విజయవాడ పెజ్జోనిపేట లోని నీతోడు మానసిక వికాసకేంద్రాన్ని ఉచితంగా సంప్రదించవచ్చు అని,   ఈ మత్తు పదార్ధాల వ్యసనం నుండి బైటకు తీసుకురావడానికి డీ-ఎడిక్షన్‌ చికిత్స ద్వారా సాధారణ స్థితికి తీసుకొనిరావచ్చు అని,  నూజివీడు మండలం పొనసనిపల్లి లో ఈ చికిత్స అందించేందుకు ‘నవజీవన్ బాల భవన్ ఏర్పాటు చేసిన బోస్కో డీ-ఎడిక్షన్‌ సెంటర్ ఉన్నాయి అని,  ఈ లాంటి సమస్యల తో ఉన్న  విద్యార్థులకు, మరియు యువతకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్: 9490492020, అని అన్నారు.   ఈ కార్యక్రమములో చాటపార్రు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రదీప్ , ఆశా మరియు ఆరోగ్య కార్యకర్తలు, పాల్గొన్నారు.

About Author