NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

తక్షణమే డీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్లు విడుదల చేయాలి-డివైఎఫ్ఐ

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: భారత ప్రజాతంత్ర యువజన సమఖ్య జిల్లా కమిటీ సమావేశం రాఘవేంద్ర అధ్యక్షతన సుందరయ్య భవనంలో జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరము రాష్ట్రంలో ఖాళీ అయ్యే ఉద్యోగాలతో కలిపి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి నాలుగు సంవత్సరాలు కావస్తున్న ఒక్క డీఎస్సీ గ్రూప్ 2 ట్రాన్స్కో సివిల్ ఏఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వలేదని ఎక్కడ డీఎస్సీ గ్రూప్ 2 ట్రాన్స్కో నోటిఫికేషన్లు అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 56 వేల ఉపాధ్యాయ పోస్టులు అవసరం కాగా రేస్నాలైజేషన్ పేరుతో 30 వేల ఉపాధ్యాయ ఉద్యోగాలను ఊడగొట్టాడని తెలిపారు. తక్షణమే 25 వేల ఉపాధ్యాయ ఉద్యోగాలకు మెగా డీఎస్సీ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రేపు ఏప్రిల్ 3 తేదీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాలు డి ఈ ఓ కార్యాలయాల ముందు భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని ఈ నిరసన కార్యక్రమాల్లో బీఈడీ టిటిసి చదువుకొని ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్నా డీఎస్సీ అభ్యర్థులందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 5600 గ్రూప్ 2 ఉద్యోగాలకు ట్రాన్స్కో లో ఏఈ ఉద్యోగాలకు కూడా తక్షణమే నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యార్థి యువజన సంఘాలు నిరుద్యోగులతో కలిసి పోరాటాలను ఉదృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి శిరీష జిల్లా సహాయ కార్యదర్శలు మైన, హుసేన్ బాషా జిల్లా నాయకులు ప్రకాష్, గోవర్ధన్, రంగప్ప, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.

About Author