కాల్వబుగ్గ దేవస్థానంలో..పర్యటించిన డీఎస్పీ..
1 min read
భారీగా పోలీస్ సిబ్బంది విధులు
సిబ్బందికి దిశా నిర్దేశం చేసిన రూరల్ సీఐ చంద్రబాబు..
ఓర్వకల్లు (మిడుతూరు) న్యూస్ నేడు : కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండల పరిధిలోని కాల్వబుగ్గలో మహా శివరాత్రి సందర్భంగా 28వ తేదీన సాయంత్రం 5 గం.కు జరగనున్న శ్రీ భ్రమరాంబ బుగ్గరామేశ్వర స్వామి రథోత్సవానికి వివిధ ప్రాంతాల నుంచి భారీగా ప్రజలు వస్తున్న నేపథంలో అనుసరించాల్సిన బందోబస్తు గురించి కర్నూలు డీఎస్పీ బాబూ ప్రసాద్,నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షులు మరియు టీటీడీ పాలక మండలి సభ్యులు మల్లెల రాజశేఖర్,కర్నూలు రూరల్ సీఐ చంద్రబాబు నాయుడు మంగళవారం దేవస్థానంలో వారు పర్యటించారు.రథోత్సవ కార్యక్రమంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు దేవస్థానంలో జరుగుతున్న పనుల గురించి వారు చర్చించారు.ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆలయ కార్య నిర్వహణ అధికారి మద్దిలేటికి వారు సూచించారు.దేవాలయంలోని గదులు మరియు దేవాలయ పరిసర ప్రాంతాలను వారు పరిశీలించారు.రథోత్సవంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సిబ్బందికి డీఎస్పీ వివరించారు.ఈ కార్యక్రమం సజావుగా జరిగేందుకు ప్రజలు సహకరించాలని డీఎస్పీ కోరారు.ఈ కార్యక్రమానికి రూరల్ సీఐ ఆధ్వర్యంలో భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు.దేవాలయం దగ్గర సాయంత్రం కర్నూలు రూరల్ సీఐ చంద్రబాబు నాయుడు పోలీస్ సిబ్బంది నిర్వర్తించాల్సిన విధుల గురించి సిబ్బందికి తగు సూచనలు తెలియజేశారు.
