NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కర్నూలులో… దుబాయ్​ సిటీ ఎగ్జిబిషన్​

1 min read

ప్రారంభించిన ఎమ్మెల్యే హఫీజ్​ఖాన్​

పల్లెవెలుగు వెబ్: కర్నూలు నగరంలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఎఫ్.కే దుబాయ్ ఎగ్జిబిషన్ కర్నూలు శాసనసభ్యులు హాఫిజ్ ఖాన్ గారు ముఖ్యఅతిధిగా విచ్చేసి ప్రారంభించడం జరిగింది… కర్నూలు శాసనసభ్యులు హాఫిజ్ ఖాన్ గారు మాట్లాడుతూ ఎఫ్. కె దుబాయ్ ఎగ్జిబిషన్ నిర్వహన వారు నిజంగా మొట్టమొదటిసారిగా కనీవినీ ఎరుగని రీతిలో దుబాయ్ సిటీ ని తలపించే భారీ సెట్టింగులతో లండన్ బ్రిడ్జి, మలేషియన్ ట్విన్ టవర్స్, burj kalifa ,మరియు ఇప్పటివరకు ఎన్నడూ చూడని విధంగా భారీ యూనివర్సల్ గ్లోబ్ మన దుబాయ్ఎగ్జిబిషన్ నందు ఏర్పాటు చేయడమైనది. పిల్లలు మరియు పెద్దలకు అధునాతనహంగులతో వినోదాన్ని ఆహ్లాదాన్ని అందించే అమ్యూజ్ మెంట్, బ్రేక్ డాన్స్, సొలంబో, కొలంబస్, క్రాస్ వీల్,జాయింట్ వీల్, పిల్లల కోసం ప్రత్యేకంగా బేబీట్రైన్, chand tara, స్కార్పియో, మోటార్ సైకిల్, బోటింగ్ తదితర ఈవెంట్స్ ఏర్పాటు చేయడమైనది.అంతే కాకుండా భారత దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి షాపింగ్ మాల్స్ పిల్లలకు ఎలక్ట్రానిక్ ఆట వస్తువులు, ఆకర్షణీయమైన జ్యువలరీ, కాటన్ రెడీమేడ్స్, లెదర్ హ్యాండ్ బ్యాగ్స్, గృహోపకరణాలు, కశ్మీరీ తివాచీలు,ఢిల్లీ మసాలా పాపడ్ (అప్పడం) ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, స్మోక్ బిస్కెట్ తదితర ప్రత్యేకమైన రుచికరమైన తినుబండారాలు మన దుబాయ్ ఎగ్జిబిషన్ నందు అన్ని సౌకర్యలతో ప్రజలకు మంచి వినోదం కలిగించే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అని తెలిపారు .ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author