డీజిల్ పై బాదుడు.. లీటర్ కు రూ. 25 పెంపు !
1 min readపల్లెవెలుగువెబ్ : బల్క్ కస్టమర్లకు డీజిల్ రేట్లను భారీగా పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఒకేసారి లీటరు డీజిల్‌పై రూ.25 మేర పెంచేశాయి. రష్యా-ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు 40 శాతం మేర పెరగడంతో ధరల పెంపు అనివార్యమైందని పలు సంస్థలు వెల్లడించాయి. కాగా పెట్రోల్ బంకుల్లో విక్రయించే డీజిల్ రిటైల్ ధరలు ప్రస్తుతానికి యథాతథంగా ఉండనున్నాయి.ప్రస్తుతం ముంబయిలో లీటరు బల్క్ డీజిల్ ధర రూ.122.05 ఉండగా.. రిటైల్ పెట్రోల్ బంకుల్లో రేటు రూ.94.14గా ఉంది. ఢిల్లీలో బల్క్ డీజిల్ ధర రూ.115 ఉంటే.. రిటైల్ ధర రూ.86.67 ఉంది.