NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉపాధ్యాయ ఉద్యోగులకు రావలసిన బకాయిలను వెంటనే చెల్లించాలి..ఆపస్

1 min read

పల్లెవెలుగు వెబ్  విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ప్రకాశంజిల్లా కార్యవర్గ సమావేశం ఒంగోలులోని జిల్లాకార్యాలయం లో జిల్లా అధ్యక్షులు కె. మల్లికార్జున రావు అధ్యక్షతన జరిగినది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పదవ తరగతి స్పాట్ వాల్యుయేషన్ లో అనారోగ్య కారణాలతో హాజరు కాలేక పోతున్న వారికి మినహాయింపు ఇవ్వాలని, హాజరైన వారికి  పారితోషికం పెంచాలని కోరారు.రాష్ట్ర సంఘటన కార్యదర్శి సిహెచ్. శ్రావణకుమార్ మాట్లాడుతూ ప్రభుత్వంతో అనేక సార్లు చర్చించినప్పటికి అనేక ఆర్థిక బకాయిలు  పెండింగ్ లో ఉన్నాయని పి.అర్.సి., ఐ.ఆర్.లపై ఏ నిర్ణయం తీసుకోకుండా ఎన్నికలకు పోవడం గత 15 సంవత్సరాలలో మొదటిసారని అన్నారు. రాష్ట్ర అధ్యక్షులు యస్. బాలాజీ  మాట్లాడుతూ కరువుబత్యం, సంపాదితసెలవు, ప్రావిడెంట్ ఫండ్, ఏపిజి యల్ఐ లోన్లు, ఫైనల్ పేమెంట్స్  లు పెండింగ్ లో ఉన్నాయని, ప్రభుత్వం అనేక సార్లు హామీ ఇచ్చి మరచినదని మార్చి 31 లోగ చెల్లిస్తా మన్న హామీ ని నిలుపుకోవాలని కోరారు. జిల్లా ప్రధాన కార్యదర్శి టి. దిలీప్ చక్రవర్తి మాట్లాడుతూ జిల్లా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారములో ఆపస్ ముందు ఉంటుందని, కార్యకర్తలు సంఘ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా రాష్ట్ర బాధ్యులను ఘనంగా సత్కరించారు. ఈ సమావేశములో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సిహెచ్. హిమజ, జిల్లా బాధ్యులు జీ. లక్ష్మినారాయణ,బి. గుణ ప్రసాద్, కె.చంద్రశేఖర్, శర్మ, ఫణి, కోటేశ్వరరావు, శంకరరావు, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

About Author