NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దుర్గా భోగేశ్వర ఆలయంలో.. రథశాల షెడ్డు ప్రారంభం

1 min read

పల్లెవెలుగు వెబ్​,గడివేముల: మండలంలోని శ్రీ దుర్గా భోగేశ్వర స్వామి దేవస్థానంలో ఆదివారం ఆరు లక్షల 75 వేల రూపాయల నిధులతో ఏర్పాటు చేసిన రథసాల షెడ్డు ప్రారంభోత్సవానికి పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ముందుగా ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి ఆలయ సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆలయ అర్చకులు శ్యాం సుందర్ శర్మ ఎమ్మెల్యే కాటసాని రాముపాల్ రెడ్డికి రుద్రాభిషేకం ఆశీర్వచనాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామాల్లో సమస్యలను నాయకులు, రైతులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా దేవదాయ శాఖ అధికారి సుధాకర్ రెడ్డి, ఆలయ అధికారి చంద్రశేఖర్ రెడ్డి ,ఆలయ చైర్మన్ రాచమల్ల గోపాలయ్య, ఆలయ కమిటీ సభ్యులు చింతల రమణ యాదవ్, గడిగరేవుల సర్పంచ్ రామ్మోహన్ రెడ్డి, ఉప సర్పంచ్ గోదాప్రసాద్ వైసీపీ నాయకులు సిద్ధం రాఘవయ్య, పెసర వాయి ఎల్లారెడ్డి, కరిమద్దల ఆర్బికే చైర్మన్ పుల్లయ్య, దుర్వేసి బండపల్లి రమేష్, కొరటమద్ది సర్పంచ్ నాగేశ్వర్ రెడ్డి, కృష్ణారెడ్డి, ఆలయ అర్చకులు గిరిధర్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

About Author