NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దుర్గా భోగేశ్వరుడి కళ్యాణం కమనీయం

1 min read

– కార్తీక పౌర్ణమి సందర్భంగా కిక్కరిసిన శైవ క్షేత్రం..
పల్లెవెలుగు, వెబ్ గడివేముల: గడిగరేవుల గ్రామ పరిధిలో వెలసినటువంటి శ్రీ దుర్గా భోగేశ్వరం స్వామి దేవస్థానంలో సోమవారం నాడు కార్తీక మాసం రెండవ సోమవారం మరియు కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామి వారి కల్యాణం మరియు ధూప దీప నైవేద్యం,మహాన్యాస పూర్వక ఏక వర రుద్రాభిషేకం అత్యంత వైభవంగా అశేష జన వాహిని మధ్య ఆలయ కమిటీ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని క్షేత్రంలో గల పంచామృత కొనేర్లలో స్నానం ఆచరించి స్వామి వారికి అభిషేకాలు,అర్చనలు,ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు ఆలయవరణలో మహిళా భక్తులు దీపాలు వెలిగించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు .ఈరోజు స్వామి వారి కళ్యాణంలో ఎంపీడీవో విజయసింహా రెడ్డి దంపతులు, సాంబశివరావు దంపతులు,ఆలయ చైర్మన్ రాచమల్ల గోపాలయ్య దంపతులు ధర్మకర్తల మండలి వెంకటరమణ దంపతులుసుశీలమ్మ,మంజుల,సరోజమ్మ,నాగేశ్వర రెడ్డి,సత్యం రెడ్డి,మధు పాల్గొన్నారు. భక్తులకుఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈవో చంద్రశేఖర్ రెడ్డి ఆలయ చైర్మన్ రాచమల్లు గోపాలయ్య మరియు ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు..వచ్చిన భక్తులకు ఆర్యవైశ్య సత్రం నందు మరియ కాశి రెడ్డి నాయన ఆశ్రమం నందు ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

About Author