తనిఖీల్లో 10 లీటర్ ల నాటు ద్వారా స్వాధీనం..
1 min read– నాటు సారా తయారీ చట్టరీత్యా నేరం, కఠిన శిక్షలు అమలు..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ఏలూరు జిల్లా ఎస్పి డి మేరీ ప్రశాంతి ఆదేశాల మేరకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ సూపరిoడెండెంట్ అరుణకుమారి ఆధ్వర్యంలో భీమడోలు స్టేషన్ పరిధిలో ఇన్స్పెక్టర్ సుబ్రమణ్యం మరియు సిబ్బందికి రాబడిన సమాచారం మేరకు ద్వారకాతిరుమల మండలం రామన్నగూడెం గ్రామ శివారులో తాళ రాజేష్ అనే వ్యక్తి యూనికాన్ బండి పై సారా విక్రయిస్తున్నాడు అనే పక్కా సమాచారంతో సిబ్బంది రైడ్ చేయగా సిబ్బందిని చూసి ముద్దాయి పారిపోతున్న క్రమంలో సిబ్బంది చాకచక్యంగా పట్టుకుని తనిఖీ చేయగా బండిలో 10 లీటర్ల సారానీ పట్టుకోవడం జరిగిందని నాటు సారా తయారీ చట్టరీత్యా నేరమని. కఠిన శిక్షలు అమలవుతాయని ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఎవరైనా నాటు సారా కాచి అమ్మే లేక తరలించే కార్యక్రమాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ సుబ్రమణ్యం, హెడ్ కానిస్టేబుల్ సత్తిబాబు, హెడ్ కానిస్టేబుల్ సీతారాం, హెడ్ కానిస్టేబుల్ మురళీకృష్ణ , కానిస్టేబుల్ మూర్తి, జి ఎం ఎస్ కె కుసుమ కుమారి తదితరులు పాల్గొన్నారు.