PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీశైలం బ్రహ్మోత్సవాలలో

1 min read

శ్రీశైలం బ్రహ్మోత్సవాలలో సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదు :-

త్రాగునీరు, పారిశుద్ధ్యం, మెడికల్, భద్రత, ట్రాఫిక్ సమస్యలు లేకుండా గట్టి చర్యలు చేపట్టండి :-

సంబంధిత అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు :-

కర్నూలు, ఫిబ్రవరి 21: శ్రీశైలం బ్రహ్మోత్సవాలలో సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ఫిబ్రవరి 22 నుంచి మార్చి 4వ తేదీ వరకు జరిగే శ్రీశైల బ్రహ్మోత్సవాల సందర్భంగా సంబంధిత అధికారులతో ఇప్పటి వరకు చేపట్టిన పనులు తదితర వాటిపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…..ప్రసిద్ధ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలం బ్రహ్మోత్సవాల సందర్భంగా పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని డిపిఓను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. వెంకటాపురం, నాగలూటి, పెద్ద చెరువు, భీముని కొలను ప్రాంతాలలో శివమాల భక్తులకు, కాలి నడకన వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు టెంట్ లతోపాటు, వైద్య పరంగా మెడికల్ శిబిరాలు, అంబులెన్సులను సిద్ధంగా ఉంచుకోవాలని డీఎంహెచ్ ఓను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. శివ మాల ధరించి కాలినడకన వెళ్లే మార్గాలను తాను పర్యటిస్తానని జిల్లా కలెక్టర్ ఫారెస్ట్ అధికారులను సూచించారు. సమాచారం కోసం వైర్లెస్ సెట్లు సిద్ధంగా ఉంచుకోవాలని ఫారెస్ట్ శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. శ్రీశైలంలో 30 పడకల ఆసుపత్రికి సంబంధించి వైద్యపరంగా కావాల్సిన మందులు అన్ని సిద్ధంగా ఉంచుకొని భక్తులకు మంచి సేవలు అందించాలన్నారు. హోటల్స్ లో అధిక ధరలకు విక్రయించకుండా దుకాణాల వద్ద రేట్లకు సంబంధించి డిస్ప్లే బోర్డు ప్రదర్శించేలా చూస్తూ మానిటరింగ్ చేయాలని డిఎస్ఓను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అలాగే అన్న ప్రసాదం, త్రాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ, పార్కింగ్, ట్రాఫిక్ నిర్వహణ, పోలీసు భద్రత, గజ ఈతగాళ్ల ఏర్పాటు, మెడికల్ క్యాంపులు లాంటి అన్ని అంశాల్లో ఎటువంటి సమస్య తలెత్తకుండా అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పగడ్బందీగా చర్యలు తీసుకోవాలన్నారు. జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) ఎం కె వి శ్రీనివాసులు మాట్లాడుతూ…. శ్రీశైల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఫిబ్రవరి 27, 28, మార్చి 1, 2 తేదీల్లో భక్తుల తాకిడి అధికంగా ఉంటుందని అందుకోసం ప్రత్యేకంగా శానిటేషన్ పై దృష్టి పెట్టాలని డిపిఓను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా డిపిఓ, ఫారెస్ట్, డిఎంహెచ్ ఓ, డీఎస్ఓ అధికారులతో శ్రీశైలంలో ఇప్పటి వరకు చేసిన పనుల పురోగతిపై అడిగి తెలుసుకొని సమీక్షించారు. ఈ సమీక్షలో డిఆర్ఓ పుల్లయ్య, ఏఎస్ పి, డిపిఓ నాగరాజు నాయుడు, డిఎంహెచ్ ఓ డాక్టర్ రామగిడ్డయ్య, డిఎస్ఓ రఘువీర్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

About Author