వైకాపా హయాంలో..ఇంటింటికీ పథకాలు
1 min read
కార్యకర్తల సమావేశంలో డాక్టర్ సుదీర్..
నందికొట్కూరు, న్యూస్ నేడు: వైకాపా ప్రభుత్వ హయాంలో ప్రతి ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కిందని నందికొట్కూరు వైసీపీ సమన్వయకర్త డాక్టర్ ధారా సుధీర్ అన్నారు.మంగళవారం నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ, మండల కమిటిలను పూర్తి చేసిన సందర్భంగా వివిధ కమిటీల నాయకులతో సమావేశం జరిగింది.ఈ సందర్భంగా డాక్టర్ సుధీర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అదికారంలోకి వచ్చి 10 నెలల కాలం దాటుతున్నా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడంలో విఫలం అయిందని అన్నారు.కార్యకర్తలపైన అక్రమ దాడులు చేస్తున్నారు.వీటిని త్వరలో తిప్పికొడతామని పార్టీ కోసం కష్టపడుతున్న ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని మీరెవ్వ రూ అధైర్య పడాల్సిన అవసరం లేదని కార్యకర్తలకు భరోసానిచ్చారు.ఈ కార్యక్రమంలో జడ్పిటీసీలు సుధాకర్ రెడ్డి,పోచా జగదీశ్వరరెడ్డి,నంద్యాల జిల్లా ఉపాధ్యక్షులు రమేష్ నాయుడు,జిల్లా ప్రదాన కార్యదర్శి తిరుమల్ రెడ్డి,నాగిరెడ్డి,చిన్న మల్లారెడ్డి, సర్పంచ్ లు నాగార్జున రెడ్డి,జనార్థన్ గౌడ్ నాయకులు తోకల కృష్ణారెడ్డి,అశోక్ రెడ్డి,రమణ,అబూ బక్కర్, జబ్బార్ తదితరులు పాల్గొన్నారు.