అక్టోబరు 7 నుంచి శ్రీశైలంలో దసరా మహోత్సవాలు
1 min read
పల్లెవెలుగు వెబ్, శ్రీశైలం : రెండవ కాశీగా ప్రసిద్ధిగాంచిన శ్రీశైల పుణ్యక్షేత్రవంలో అక్టోబరు 7 నుంచి 15వ తేదీ వరకు దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, దేవదాయశాఖ ముఖ్యం కార్యదర్శి డా.జి వాణీ మోహన్, శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీ ఎస్. లవన్న సోమవారం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి దసరా మహోత్సవాలకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రివర్యులకు శ్రీస్వామి అమ్మవార్ల శేషవస్త్రం, ప్రసాదాన్ని అందజేశారు.