NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఐ ఎన్ టి యు సి ఆధ్వర్యంలో దసరా పండుగ పూజలు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  జిల్లా ఎన్టియుసి అధ్యక్షులు బి బతుకన్న  ఆధ్వర్యంలో దసరా పండుగ సందర్భంగా పూజలు నిర్వహించారు. మంగళవారం ఉదయం 11 గంటలకు రైల్వే గూడ్ షెడ్డులో రైల్వే కాటాకు పూజలు నిర్వహించారు. రైల్వే ఐ ఎన్ టి యు సి కార్మికులు, మరియు  స్లిప్పర్స్ కలిసి విజయదశమి సందర్భంగా పూజా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ పూజా కార్యక్రమంనకు ముఖ్య అతిథులుగా కర్నూలు జిల్లా కాంగ్రెస్ నూతన అధ్యక్షులు కె బాబు రావు  హాజరయి కార్మికులు సమన్వయంతో పూజా కార్యక్రమం చేయడం ఎంతో ఆనందదాయకంగా ఉందని జిల్లాలో ఐఎన్టియుసి సంఘం బలమైన సంఘం అని కార్మికుల సమస్యలు ఏవైనా ఉన్న తమ దృష్టికి తీసుకొని రావాలని పార్టీ తరఫున పరిష్కరిస్తామని బాబు రావు  వారికి హామీ ఇచ్చారు. ఐ ఎన్ టి సి హమాలి సోదరులంతా బాబురావు ని పూలమాలలతో సత్కరించారు. అదేవిధంగా  రైల్వే కాంట్రాక్టరు రామకృష్ణ  ఎన్ డి ఆర్ మేనేజర్  బియ్యం కాంట్రాక్టరు రాజా  టోపీ  రైల్వే అధికారులు మున్న వారి  బృందం మరియు రైల్వే హమాలి సంఘ మగధం కే ఆనందం  షాషావలి  ఐదు టోలీల మకదములు కలిసి విజయదశమి పండుగ శుభాకాంక్షలతో  పలకరించుకొని రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో  ఉండాలని కోరుచూ ప్రతి సంవత్సరము ఇదే విధంగా ఈ వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషకరమని రైల్వే గూడ్ షెడ్డులో పనిచేసే ప్రతి ఒక్కరు క్షేమంగా ఉండాలని బతుకన్న  ఆకాంక్షించారు.

About Author