7 నుండి మహానంది క్షేత్రంలో దసరా ఉత్సవాలు ప్రారంభం
1 min readపల్లెవెలుగువెబ్, మహానంది: మహానంది క్షేత్రం లో నేటి నుండి 15వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్టు ఏఈవో మధు తెలిపారు .ఈ క్షేత్రంలో 9 రోజులపాటు శ్రీ కామేశ్వరీ దేవి అమ్మవారి ని వివిధ రూపాల్లో అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తూ ఉన్నట్లు పేర్కొన్నారు .బుధవారం సాయంత్రం మహానంది లో వెలిసిన శ్రీ కామేశ్వరి దేవి సమేత మహానందీశ్వరుడు ఉత్సవమూర్తులు నంద్యాల నుండి బ్రహ్మానంద ఆలయానికి బయలుదేరి వెళ్లాయి.
తొమ్మిది రోజుల పాటు అక్కడే పూజలు అందుకున్న అనంతరం తిరిగి 16వ తేదీ మహానంది క్షేత్రానికి ఉత్సవమూర్తులను చేరుతాయని ఏ ఈ ఓ మధు తెలిపారు .ఉత్సవ మూర్తులు బయలుదేరుతున్న సందర్భంగాఏ ఈ ఓ మధు వేదపండితులు రవిశంకర్ అవధాని నాగేశ్వర శర్మ శాంతారాం బట్ స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.