14 నుండి 24 వరకు దసరా సెలవులు..
1 min readసెలవుల్లో విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు శ్రద్ధ వహించాలి..
చట్టవిరుద్దంగా ప్రభుత్వ , ప్రైవేట్ పాఠశాలలు కొనసాగిస్తే కఠిన చర్యలు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : కమిషనర్, పాఠశాలల విద్యా శాఖ వారి ఉత్తర్వుల అనుసరించి జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో )ఈనెల 14వ తేదీ నుండి 24వ తేదీ వరకు దసరా సెలవులు ఇవ్వనున్నట్లు తెలిపారు. 25వ తారీఖున మరల పాఠశాలలు ప్రారంభించబడతాయని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలకే కాకుండా ప్రైవేట్ పాఠశాలలకు ఈ సెలవులు వర్తిస్తాయని, దసరా సెలవులను ప్రభుత్వం ప్రకటించిందని ఈ సెలవు దినలలో ఎవరైనా పాఠశాలలను నిర్వహించినట్లు తెలిస్తే శాఖపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే ఈ సెలవుల్లో పిల్లల ఆటపాటలపై పూర్తిగా దృష్టిని వాటిపై ఉంచకుండా చదువుపై కూడా ఆసక్తి దృష్టి ఉంచాలని సూచించారు. సెలవులపై ఉన్న ఉపాధ్యాయులు వారికి గైడెన్స్ ఇచ్చి పిల్లలు ఏ సబ్జెక్టుల్లో వెనుకంజలో ఉన్నారో వారిని గుర్తించి సబ్జెక్టులపై ముందుకు తీసుకువెళ్లాలని ఫోన్లో ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులను, విద్యార్థులను చదువుపై శ్రద్ధ ఉంచే విధంగా శ్రద్ధ తెలుసుకోవాలని విద్యాశాఖ అధికారి తెలియజేశారు.