PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నందికొట్కూరులో దసరా స్వీట్ మహామేళా..

1 min read

పల్లెవెలుగు వెబ్​, నందికొట్కూరు: నందికొట్కూరు పట్టణంలోని ఆత్మకూరు రోడ్డు లో   దసరా పండగ సందర్భంగా తమ్మడపల్లి ఏసేపు  ఆత్రేయ పురం వైరెటి స్వీట్స్ మహా మేళా ను  ఏర్పాటు చేశారు. ఆదివారం నందికొట్కూరు అర్బన్ ఎస్ ఐ ఎన్. వి.రమణ ముఖ్య అతిథిగా హాజరై స్వీట్స్ మేళా ను  ప్రారంభించారు.మహా మేళా లో ఆత్రేయ పురం నేతి బెల్లం పూత రేకులు, మామిడి తాండ్ర,రాజమండ్రి స్పెషల్ స్వీట్స్, అన్నమయ్య లడ్డు  కొనసీమ స్పెషల్ బెల్లం కొవ్వ అందుబాటులో ఉన్నాయి. ఆదివారం నుండి 5వ తేదీ బుధవారం వరకు మేళా నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. పట్టణ,గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో టిడిపి నందికొట్కూరు నియోజకవర్గ అధికార ప్రతినిధి కాకరవాడ చిన్న వెంకట స్వామి, మైనార్టీ టిడిపి అధికారి ప్రతినిది షకిల్ అహమ్మద్, టిడిపి లీగల్ అడ్వైజర్ జాకీర్ హుసేన్, ఐ టీడీపీ పట్టణ అధ్యక్షుడు మూర్తుజావలి, సీపీఎం నాయకులు వెంకటేశ్వర్లు, రాజు, సీపీఐ నాయకులు రఘురాం మూర్తి, ఎమ్మార్పీఎస్ నాయకులు కాటం చిన్న నాగన్న, టిడిపి నాయకులు కళాకర్ , బొల్లెద్దుల రాజన్న, తదితరులు పాల్గొన్నారు.

About Author